నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు! | Ileana D'Cruz raises temperatures in a bikini photoshoot | Sakshi

నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు!

Published Mon, Apr 21 2014 10:32 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు! - Sakshi

నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు!

టూపీస్ బికినీలో ఇలియానా ఫొటోషూట్.. ఇప్పుడు ఎక్కడ చూసినా అదే హాట్ టాపిక్. ఈ ఫొటోషూట్‌కి సంబంధించిన వీడియో కూడా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ముప్ఫై సినిమాల్లో నటించినా రాని పాపులారిటీ ఒక్క ఫొటో షూట్‌తో సొంతం చేసుకుంది ఇల్లూ బేబీ. ఈ ఫొటో షూట్ పుణ్యమా అని... మళ్లీ ఇలియానాను తెలుగులో ఓ సై ్టలిష్‌హీరో సరసన నటింపజేయడానికి ఈ మధ్య ప్రయత్నాలు కూడా జరిగాయట. అయితే... ఆ ప్రయత్నాలు బెడిసికొట్టాయని టాలీవుడ్ టాక్. రెండు కోట్లు ఇస్తామని సదరు నిర్మాతలు ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినా... ‘మూడు కోట్లు ఇచ్చినా నేను చేయలేను. ఎందుకంటే... బాలీవుడ్‌లో నేను బిజీ’ అని తేల్చి చెప్పేశారట ఇలియానా.
 
 ఈ ఫొటో షూట్ ఇలియానాకు ఆ స్థాయిలో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇటీవల ఈ షొటోషూట్ గురించి ఇలియానా మాట్లాడుతూ- ‘‘నా లేటెస్ట్ ఫొటోషూట్‌లో నన్ను చూసిన వారందరూ చాలా అందంగా ఉన్నావని మెచ్చుకుంటున్నారు. కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏదేమైనా ఆ ఫొటోషూట్ నాకు మంచి పేరునే తెచ్చిపెట్టింది. నిజానికి ఆ ఫొటో షూట్‌లో పోజులివ్వడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. గోవాలో సముద్రం ఒడ్డునే మా ఇల్లు అయినా... నాకెందుకో సముద్రం అంటే కాస్త భయం. కానీ... ఈ ఫొటో షూట్ కోసం సముద్రంలో కొంత దూరం వెళ్లి, అక్కడ పోజులివ్వాల్సి వచ్చింది.
 
 భయం కళ్లలో కనిపించకుండా జాగ్రత్తపడుతూ ఈ స్టిల్స్ ఇచ్చాను’’ అని చెప్పారు ఇలియనా. ‘ఫొటోషూట్‌లో చాలా సన్నగా కనిపించారు. ఉన్నట్టుండి అలా చిక్కిపోయారేం?’ అని అడిగితే.. ‘‘నా ఆహారపట్టిక చూస్తే హీరోయిన్లు ఇంత భారీగా కూడా తింటారా? అని ఆశ్చర్యపోతారు. నేను భోజనప్రియురాలిని. ఇష్టమైన ఐటమ్స్ అన్నింటినీ చక్కగా లాగించేస్తా. ఎంత తిన్నా నేను బరువు పెరగకపోవడానికి కారణం ఎక్కువ సేపు వర్కవుట్స్ చేయడమే. శరీరానికి అవసరం లేని కేలరీస్ అన్నీ కరిగించేస్తా’’ అని చెప్పారు ఇలియానా.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement