
ఊహల్లో కూడా అతణ్ణి సోదరుడిలా అనుకోలేను!
రీల్ లైఫ్‌లో రొమాన్స్ చేసే హీరో, హీరోయిన్ల మధ్య మంచి అండర్ స్టాండింగ్ కుదిరితే రియల్ లైఫ్‌లో ఫ్రెండ్స్‌గా కొనసాగుతారు. అంతే తప్ప బ్రదర్, సిస్టర్ బాండింగ్ ఉండేవాళ్లు చాలా తక్కువమంది ఉంటారు. ఇటీవల ఓ సందర్భంలో ఇలియానా ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చి, ‘మీ సరసన నటించే హీరోల్లో మీరు ఎవర్ని బ్రదర్‌లా ఫీలవుతారు?’ అని ఓ విలేకరి అడిగితే, ‘ఎవర్నీ అలా అనుకోను’ అని ఆమె ముక్కుసూటిగా సమాధానం ఇచ్చారు.
కనీసం ఎవరినైనా బ్రదర్‌లా ఊహించుకునే ప్రయత్నమైనా చేస్తారా అంటే.. ‘‘రణ్‌బీర్ కపూర్‌ని మాత్రం ఊహల్లో కూడా బ్రదర్‌లా అనుకోలేను’’ అని మొహమాటపడకుండా చెప్పేశారీ గోవా బ్యూటీ. ఇలియానా తొలి హిందీ చిత్రం ‘బర్ఫీ’లో రణ్‌బీరే హీరో. ఆ చిత్ర సమయంలో ఈ చాక్లెట్ బాయ్‌తో ఇలియానా చాలా స్నేహంగా ఉండేవారు. రణ్‌బీర్‌లో మంచి స్నేహితుణ్ణి చూస్తున్న ఇలియానా, అతనిలో బ్రదర్‌ని చూడలేకపోతున్నారేమో. అందుకే కాబోలు... ఎప్పటికీ రణ్‌బీర్‌లో బ్రదర్‌ను చూడనంటే చూడలేనని తెగేసి చెప్పారామె.