మహేష్ బాబు ఎవరో కూడా తెలీదు..! | ileana about south films and Mahesh babu | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు ఎవరో కూడా తెలీదు..!

Published Fri, Oct 6 2017 12:43 PM | Last Updated on Fri, Oct 6 2017 1:25 PM

ileana

బాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా.. తన తాజా చిత్రం బాద్ షాహో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో ఇలియానా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సందర్భంగా తన సినీ రంగం ప్రవేశంపై మీడియాతో మాట్లాడిన ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఇలియానా సౌత్ సినీ రంగం గురించి మాట్లాడింది.

చిన్నతనంలో ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచనతో ఎయిర్ హెస్టస్ కావాలనుకున్నానని తెలిపిన ఇలియానా.. తరువాత ష్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లిందని తెలిపారు. అయితే దేవుడు మాత్రం తనను సినీ రంగంవైపు నడిపించాడన్నారు. 16 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో అప్పట్లో ఏం తెలిసేది కాదన్న ఇల్లిబేబీ.. పోకిరి సినిమాకు ముందు మహేష్ ఎవరో కూడా తెలియని చెప్పారు. తరువాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నానన్న ఇలియానా ప్రస్తుతం తన వృత్తిపై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement