Baadshaho
-
మహేష్ బాబు ఎవరో కూడా తెలీదు..!
బాలీవుడ్ లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఇలియానా.. తన తాజా చిత్రం బాద్ షాహో సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న విజయం దక్కటంతో ఇలియానా ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సందర్భంగా తన సినీ రంగం ప్రవేశంపై మీడియాతో మాట్లాడిన ఇలియానా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఇలియానా సౌత్ సినీ రంగం గురించి మాట్లాడింది. చిన్నతనంలో ప్రపంచాన్ని చుట్టేయాలన్న ఆలోచనతో ఎయిర్ హెస్టస్ కావాలనుకున్నానని తెలిపిన ఇలియానా.. తరువాత ష్యాషన్ డిజైనింగ్ వైపు మనసు మళ్లిందని తెలిపారు. అయితే దేవుడు మాత్రం తనను సినీ రంగంవైపు నడిపించాడన్నారు. 16 ఏళ్లకే సినీ రంగంలోకి అడుగుపెట్టడంతో అప్పట్లో ఏం తెలిసేది కాదన్న ఇల్లిబేబీ.. పోకిరి సినిమాకు ముందు మహేష్ ఎవరో కూడా తెలియని చెప్పారు. తరువాత ఏళ్లు గడుస్తున్న కొద్దీ ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకున్నానన్న ఇలియానా ప్రస్తుతం తన వృత్తిపై తనకు ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని తెలిపారు. -
మేకింగ్ ఆఫ్ మూవీ - బాద్షాహో
-
మేమేం పోర్న్ చిత్రం తీయలేదు: హీరో
న్యూఢిల్లీ: తాను నటించిన చిత్రం 'బాద్షాహో'ను సెల్ఫ్ సెన్సార్ చేసినట్లు వస్తున్న వార్తలను హీరో అజయ్ దేవగన్ ఖండించారు. తానేమి పోర్న్ మూవీలో నటించలేదని అన్నారు. సర్టిఫికేషన్‌కు సీబీఎఫ్సీకు వెళ్లబోతున్న చిత్రాన్ని డైరెక్టర్ మిలన్, హీరో అజయ్ దేవగన్‌లు ఎడిట్ చేశారని వార్తలు వచ్చాయి. ఇలియానా డిక్రూజ్, అజయ్ దేవగన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అసభ్యంగా ఉంటాయనే పుకార్లు షికార్లు చేశాయి. సోమవారం సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన అజయ్ దేవగన్.. బాద్షాహోపై వస్తున్న పుకార్లపై స్పందించారు. 'అవన్నీ అబద్దం. మేమేం పోర్న్ మూవీని తీయలేదు' అని వ్యాఖ్యానించారు. -
అతడికి నో చెప్పిన ఐష్!
ముంబై: అజయ్ దేవగణ్ తాజా చిత్రం 'బాద్ షాహో' సినిమా తారాగణం ఇప్పటికే పలుమార్లు మారింది. ఐశ్వర్యరాయ్ బచ్చన్ పేరు ఈ లిస్టులో చేరింది. మిలాన్ లుతరియా తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'బాద్ షాహో'లో నటించేందుకు ఐష్ నిరాకరించింది. దిల్జిత్ దొసాన్ జహ్ స్థానంలో ఇమ్రాన్ హష్మిని తీసుకోవడం వల్లే ఆమె ఈ ఆఫర్ వదులుకుందని టాక్. ఇమ్రాన్ హష్మితో కొన్ని సీన్లు చేయాల్సి రావడం వల్లే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గతంలో కరణ్ జోహార్ కార్యక్రమంలో ఇమ్రాన్ ను 'ప్లాస్టిక్'గా ఐష్ వర్ణించింది. ఈ కారణంగానే అతడి పక్కన నటించేందుకు ఆమె అంగీకరించలేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 'బాద్ షాహో'లో మహరాణి గాయత్రి దేవి స్ఫూర్తితో ఈ పాత్రను రూపొందించినట్టు తెలుస్తోంది. ఇందులోని పాత్రలు చాలా కొత్తగా ఉంటాయని, ఇటువంటి పాత్రలు ఇంతకుముందు ఎవరూ పోషించలేదని మిలాన్ లుతరియా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో ప్రారంభంకానుంది. వచ్చే ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావిస్తు్న్నారు.