
మేమేం పోర్న్ చిత్రం తీయలేదు: హీరో
న్యూఢిల్లీ: తాను నటించిన చిత్రం 'బాద్‌షాహో'ను సెల్ఫ్ సెన్సార్ చేసినట్లు వస్తున్న వార్తలను హీరో అజయ్ దేవగన్ ఖండించారు. తానేమి పోర్న్ మూవీలో నటించలేదని అన్నారు. సర్టిఫికేషన్‌కు సీబీఎఫ్‌సీకు వెళ్లబోతున్న చిత్రాన్ని డైరెక్టర్ మిలన్, హీరో అజయ్ దేవగన్‌లు ఎడిట్ చేశారని వార్తలు వచ్చాయి.
ఇలియానా డిక్రూజ్, అజయ్ దేవగన్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు అసభ్యంగా ఉంటాయనే పుకార్లు షికార్లు చేశాయి. సోమవారం సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన అజయ్ దేవగన్.. బాద్‌షాహోపై వస్తున్న పుకార్లపై స్పందించారు. 'అవన్నీ అబద్దం. మేమేం పోర్న్ మూవీని తీయలేదు' అని వ్యాఖ్యానించారు.