
టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా చెలామణి అయిన గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆడపాదడపా సినిమాలు చేస్తోంది. దేవదాస్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. అయితే బాడీ షేమింగ్ వల్ల ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఇటీవలె వార్తలొస్తున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఇలియానా ఈ వార్తలపై స్పందించింది. అవుతను నేను గతంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మాట నిజమే. కానీ అది బాడీ షేమింగ్ వల్ల మాత్రం కాదు. 12 ఏళ్ల వయసునుంచే నాకు శరీర సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి నా శరీరాకృతి కారణం కాదు.
అప్పట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లా. అందుకే చనిపోవాలనుకున్నా. కానీ మీడియాలో మాత్రం బాడీ షేమింగ్, బాడీ డిస్మోర్ఫిక్ అంశాలతోనే ఆత్మహత్య ఆలోచన చేసినట్టు రాశారు. ఆ ఆర్టికల్ చూసి చాలామంది తనకు సందేశాలు పంపడం ప్రారంభించారు. దాంతో నాకు చాలా చిరాకు కలిగింది అంటూ అసలు విషయాన్ని బయటపెట్టిందీ భామ.
Comments
Please login to add a commentAdd a comment