‘రోజుకు 12 మాత్రలు వేసుకున్నా’ | Ileana Put On Brave Face After Her Shocking Love Breakup | Sakshi
Sakshi News home page

గదిలో ఒంటరిగానే గడిపాను!

Nov 24 2019 9:07 AM | Updated on Nov 24 2019 2:56 PM

Ileana Put On Brave Face After Her Shocking Love Breakup - Sakshi

నటి ఇలియానా మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే ప్రతి నిత్యం ఏదో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉండేదో, ఇప్పుడు అలా ఉండడానికి ప్రయత్నిస్తోంది. 2005లో సినీరంగ ప్రవేశం చేసింది ఈ గోవా బ్యూటీ . తెలుగులో దేవదాస్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలను రాబట్టుకుని స్టార్‌డమ్‌ను అందుకుంది. అయితే తమిళంలో పరిచయం అయిన కేడీ చిత్రం ఈ జాణను నిరాశ పరిచింది. దీంతో కోలీవుడ్‌ వైపు తిరిగి చూడలేదు. తెలుగులో వెలిగిపోతున్న రోజుల్లో నన్బన్‌ అనే చిత్రంతో కోలీవుడ్‌లో రీఎంట్రీ అయ్యింది. అయితే ఇక్కడ అదే ఇలియానాకు చివరి చిత్రం. తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తున్న సమయంలోనే బాలీవుడ్‌పై దృష్టి సారించడంతో దక్షిణాదికి దూరమైంది. అదే సమయంలో ప్రేమలో పడింది. ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ అనే ఫొటోగ్రాఫర్‌తో ప్రేమలో మునిగిపోయింది. 

అయితే ఆ ప్రేమ ఎంతో కాలం సాగలేదు. మనస్పర్థల కారణంగా ఈ మధ్యనే బ్రేకప్‌ అయ్యింది. అయితే ఆండ్రూతో లవ్‌ బ్రేకప్‌ నటి ఇలియానాపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ఈ విషయాన్ని తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. తన ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో ఆండ్రూకు సంబంధించిన జ్ఞాపకాలను తుడిచేసినా, మానసికంగా వాటి నుంచి బయటపడడం సుల భం కాలేదు. అతనితో లవ్‌ బ్రేకప్‌ ఇలియానాను మానసికంగా చాలా కృంగదీసింది. దీని గురించి ఇలియానా తెలుపుతూ ఆ మనోవేదన నుంచి బయటపడడానికి వారమంతా చికిత్స కోసం ఆస్పత్రి చుట్టూ తిరిగానంది. దీంతో చిత్రాల్లో నటించడం కూడా మానుకున్నానని చెప్పింది.
 

మానసికవేదనతో ఒక సమయంలో రోజుకు 12 మాత్రలు వేసుకున్నానని చెప్పింది. అందువల్ల బరువు పెరిగిపోయానని తెలిపింది. బరువు తగ్గడానికి జిమ్‌కు వెళదామనుకుంటే ఆ ఫొటోలను తీసి ఎక్కడ సామాజిక మాధ్యమాల్లో పెడతారోనన్న భయం కలిగేదని .. అందుకే జిమ్‌కు వెళ్లడం కూడా మానేశానని చెప్పింది. అలా కొంత కాలం గదిలోనే ఏకాంతంగా గడిపేసినట్లు, చాలా మానసికవేదనకు గురైనట్లు చెప్పిన ఇలియానా ఇప్పుడు మళ్లీ నటనపై పూర్తిగా దృష్టి సారించినట్లు వెల్లడించింది. ప్రస్తుతానికి హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ దక్షిణాదిలో అవకాశాలను మళ్లీ రాబట్టుకోగలుగుతుందా? ఎందుకంటే ఇప్పటికే ఓ తెలుగు చిత్రంలో నటించినా అది సత్ఫలితాన్నివ్వలేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement