ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది! | Don't prefer to talk about my personal life: Ileana D'Cruz | Sakshi
Sakshi News home page

ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది!

Published Sun, Aug 2 2015 11:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది!

ఇక్కడ ఎవరి పోరాటం వాళ్లది!

 ‘‘జీవితం అంటేనే పోరాటం. తుది శ్వాస విడిచే వరకూ పోరాడాలి’’ అని ఇలియానా అంటున్నారు. జీవితం గురించి ఇప్పుడీ రేంజ్‌లో ఈ గోవా బ్యూటీ మాట్లాడటానికి కారణం ఉంది. ఇటీవల ఎవరో ఒక వ్యక్తి మరొక వ్యక్తి గురించి తన అభిప్రాయం చెప్పడం ఇలియానా విన్నారట. అసలా వ్యక్తి జీవితం ఏంటో? అతని మనస్తత్వం ఏంటో తెలుసుకోకుండా ఇలా ఒక అభిప్రాయానికి రావడం ఇలియానాకి విచిత్రంగా అనిపించిందట. ఆ విషయం గురించి ఆమె చెబుతూ - ‘‘ఈ ప్రపంచంలో సమస్యలు లేనివాళ్లంటూ ఎవరూ ఉండరు. ఎవరి సమస్యలు వాళ్లకుంటాయి. ఎవరి పోరాటం వాళ్లది. ఇతరుల జీవితాన్ని పై పైన చూసేసి, వాళ్లు గురించి స్టేట్‌మెంట్ ఇచ్చేయడం సరి కాదు. ఆ మాటకొస్తే.. అసలు ఎవరి గురించీ ఒక జడ్జిమెంట్‌కి రాకూడదు. ఇక్కడ ఎవరూ ఉత్తములు కాదు.. ఎవరూ అథములూ కాదు. అందుకే ఎవర్నీ విమర్శించకూడదు. వీలైతే ఫ్రెండ్లీగా ఉండాలి’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement