ఇలియానా 'ముద్దు'ముచ్చట! | Ileana D Cruz kisses her boyfriend | Sakshi
Sakshi News home page

టాప్‌ హీరోయిన్‌ 'ముద్దు'ముచ్చట!

Published Mon, Sep 18 2017 9:19 AM | Last Updated on Tue, Sep 19 2017 4:44 PM

ఇలియానా 'ముద్దు'ముచ్చట!

ఇలియానా 'ముద్దు'ముచ్చట!

ప్రేమంటేనే పిచ్చి.. ఆ పిచ్చిలోకంలో స్వేచ్ఛగా విహరిస్తున్నామంటోంది ఇలియానా.. తన బాయ్‌ఫ్రెండ్‌ ఆండ్ర్యూ నీబోన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ అమ్మడు.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తమ 'ప్రేమ' ఫొటోలను షేర్‌ చేసుకుంది. నీబోన్‌తో సన్నిహితంగా విహరిస్తున్న దృశ్యాలను కెమెరాలో బంధించి అభిమానులతో పంచుకుంది. నీబోన్‌తో లిప్‌లాక్‌ చేస్తున్న ఫొటోను పోస్టు చేసి.. 'ప్రేమ అనే పిచ్చిలోకంలో..' అంటూ కామెంట్‌ పెట్టింది. అంతేకాదు ప్రియుడికి సంబంధించిన మరికొన్ని ఫొటోలను ఈ హాట్‌ భామ షేర్‌ చేసింది.

ప్రముఖ ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్, ఇలియానా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలసి షికార్లకు వెళ్లడం.. అప్పుడప్పుడు ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడం తెలిసిందే. తన బాయ్‌ఫ్రెండ్‌ గురించి ఈ మధ్య ఇలియానా మాట్లాడుతూ.. అతని గురించి తరచూ మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని, అతను సాదాసీదాగా ఉండటానికి ఇష్టపడతానని, అతని ప్రైవసీకి భంగం కలిగించకూడదని తెలిపింది. ‘‘నటీనటులను ప్రేక్షకులు ఎంతగా ప్రేమిస్తారో ఒక్కోసారి అంతకు రెండింతలు ద్వేషిస్తారు. ఏ కారణం లేకుండానే తిడతారు. ఏవేవో మాటలంటారు. కొన్నిసార్లు వాళ్ల మాటలు మరీ దారుణంగా ఉంటున్నాయి. 11 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇవన్నీ నాకు తెలుసు. నటిస్తున్నాను కాబట్టి నాకు తప్పదు. అతనూ మాటలు పడడం మంచిది కాదు. అందుకే, అతని గురించి పబ్లిగ్గా మాట్లాడను’’  అని పేర్కొంది.

 కొన్నాళ్ల క్రితం వరకు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలుగొందిన ఇలియానా.. ఇప్పుడు బాలీవుడ్‌లో నటనపరంగా మంచి పేరు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. 2012లో 'బర్ఫీ' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా 'ముబారకన్‌', 'బాద్‌షాహో' చిత్రాల్లో ప్రేక్షకులను అలరించింది.

 

A moment. In a world of madness.

A post shared by Ileana D'Cruz (@ileana_official) on

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement