పిల్లలు పుడితే..! | Ileana D'cruz to get in shape out Children born | Sakshi
Sakshi News home page

పిల్లలు పుడితే..!

Published Thu, Oct 9 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

పిల్లలు పుడితే..!

పిల్లలు పుడితే..!

 ఆలూ లేదు చూలూ లేదు.. అల్లుడి పేరు సోమలింగం అన్నారట ఎవరో. అలా ఇలియానా ఇంకా పెళ్లి గురించే ఆలోచించడంలేదు.. అప్పుడే పిల్లలు పుడితే బరువు పెరుగుతానేమో అని ఆలోచిస్తున్నారట. అవును మరి.. సన్నగా, మెరుపు తీగలా ఉండే ఏ అమ్మాయి అయినా పిల్లలు పుట్టిన తర్వాత ‘షేప్ అవుట్’ అవుతుందని భయపడటం సహజమే కదా. పైగా ఇలియానా లాంటి హీరోయిన్లకు ఈ భయం ఇంకా ఉంటుంది.
 
  అందుకేనేమో పిల్లలు పుట్టిన తర్వాత కూడా స్లిమ్‌గా ఎలా ఉండాలి? అనే విషయాలు తెలుసుకుంటున్నారట. ఆల్రెడీ ఇలియానా అక్క తల్లయ్యారు. తన అక్క గర్భం దాల్చినప్పుడు, బిడ్డను కనేలోపు వచ్చిన మార్పులు, ఆ తర్వాత మారిన ఆమె శరీరాకృతి గురించి దగ్గరగా చూశారు ఇలియానా. దాంతో తల్లయ్యాక శరీరాకృతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొంతవరకు అవగాహన చేసుకున్నారట. ఏదేమైనా దీన్నిబట్టి ఇలియానాకు ముందు చూపు ఎక్కువ అని మాత్రం అర్థమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement