బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాది పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. తాజాగా నటి స్వర భాస్కర్ ప్రెగ్నెన్సీ వెల్లడించింది. ఈ మేరకు తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
(ఇది చదవండి: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. నటిపై దారుణ ట్రోల్స్..! )
కాగా.. స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
(ఇది చదవండి: ‘ఆదిపురుష్’ థియేటర్‌లో అక్కడ ఎవరూ కూర్చోకండి)
Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! 🧿❤️✨🙏🏽 @FahadZirarAhmad #comingsoon #Family #Newarrival #gratitude #OctoberBaby pic.twitter.com/Zfa5atSGRk
— Swara Bhasker (@ReallySwara) June 6, 2023
Comments
Please login to add a commentAdd a comment