Drishyam Fame Ishita Dutta Expecting First Child, Baby Bump Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Ishita Dutta Baby Bump Photos: తల్లి కాబోతున్న దృశ్యం నటి.. సోషల్ మీడియాలో వైరల్!

Published Fri, Mar 17 2023 7:31 PM | Last Updated on Fri, Mar 17 2023 10:00 PM

Drishyam fame Ishita Dutta expecting first child baby bump goes Viral - Sakshi

బాలీవుడ్ నటి ఇషితా దత్తా పెద్దగా పరిచయం లేని పేరు. ఇటీవలే స్పస్పెన్స్ థ్రిల్లర్ మూవీ దృశ్యంలో నటించింది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఇషితా దత్తా త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.  సినిమా నటి తనూశ్రీ దత్తా సోదరి. దృశ్యం ఫేమ్ ఇషితా దత్తా 2017లో వత్సల్ షేత్‌ను పెళ్లి చేసుకున్నారు.

తాజాగా ఇషితా దత్తా ముంబై విమానాశ్రయంలో వెళ్తుండగా కెమెరాకు చిక్కింది. ఎయిర్‌పోర్ట్‌లోకి వెళ్తూ తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఆమెపై ఊహాగానాలు వచ్చనా.. గర్భం ధరించినట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించలేదు. ఈ వీడియోతో ఇషితా తన మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఇది చూసిన అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. 

ఇషితా దత్తా లవ్ స్టోరీ

ఇషితా, వత్సల్ 2016లో వారి మొదటిసారి 'రిష్టన్ కా సౌదాగర్ - బాజీగర్' షో షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి స్నేహం ప్రేమగా మారింది. అనంతరం నవంబర్ 2017లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇటీవల ముంబైలో కూడా విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement