Janatha Garage Fame Vidisha Srivastava Announces Pregnancy, Maternity Shoot Pics Goes Viral - Sakshi
Sakshi News home page

Vidisha Srivastava: తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!

Published Fri, Jun 9 2023 5:52 PM | Last Updated on Fri, Jun 9 2023 6:34 PM

Janatha Garage Fame Vidisha Srivastava Announces Pregnancy - Sakshi

భాభిజీ ఘర్ పర్ హైన్ సీరియల్ ఫేమ్ విదిషా శ్రీవాస్తవ గర్భం ధరించినట్లు వెల్లడించింది. త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి  జూలైలో తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

(ఇది చదలండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!)

టాలీవుడ్‌లో ఎంట్రీ

కాగా విదిషా టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. 'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ.  ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, దేవరాయ చిత్రాల్లో నటించింది. ఓకే ఏడాదిలో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ హిట్ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ విదిషా శ్రీవాస్తవ కీలకపాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో రియా పాత్రలో  మెప్పించింది.  కాగా.. విదిషా శ్రీవాస్తవ 2018  డిసెంబర్‌లో సాయక్ పాల్‌ను వివాహం చేసుకున్నారు.

ప్రెగ్నెన్సీ ‍ ప్లానింగ్ కాదు

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయికి వెళ్లనున్నట్లు తెలిపింది. అయితే తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయలేదని.. కానీ తన భర్త తనకు బాగా సపోర్ట్‌తో ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించింది. గతంలో ఆమె ఓ షోలో చేరిన 10 నెలలకే గర్భం దాల్చిన విషయం చెప్పేందుకు ఇబ్బంది పడినట్లు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు సెట్‌లోని అందరూ ఆమెను అభినందించారని పేర్కొంది.

(ఇది చదవండి: 'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement