Janatha Garage Actress Vidisha Blessed With a Baby Girl - Sakshi
Sakshi News home page

Vidisha: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జనతా గ్యారేజ్ నటి!

Published Sat, Jul 15 2023 2:00 PM | Last Updated on Sat, Jul 15 2023 3:42 PM

janatha Garage Actress Vidisha Blessed With a Baby Girl - Sakshi

బాలీవుడ్ భామ విదిషా శ్రీవాస్తవ బాలీవుడ్‌తో పాటు తెలుగువారికి కూడా పరిచయమే. 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత తెలుగులో అలా,ప్రేమ్‌, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలోనూ కనిపించింది. తెలుగులో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ మెరిసింది. జనతా గ్యారేజ్ మూవీలో ఓ పాత్రలో నటించారు. బాలీవుడ్‌లో ఎక్కువగా బుల్లితెరపైనే ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె ఈనెల 11న విదిషా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!)

అందుకే ప్రెగ్నెన్సీ వల్ల జూలై నుంచి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు విదిషా. ‍అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా కూడా షేర్ చేయలేదు. డెలివరీకి కేవలం 10 రోజుల ముందు నుంచి మాత్రమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అవును.. 2018లోనే విదిషా బాయ్‌ఫ్రెండ్ సాయిక్ పాల్‌ని పెళ్లి చేసుకుంది.  అయితే ఈ విషయాన్ని నాలుగేళ్ల పాటు రహస్యంగా ఉంచింది. బనారస్‌లో పెళ్లయిన విషయాన్ని ఏడాది క్రితమే అఫీషియల్‌గా ప్రకటించింది. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. 

(ఇది చదవండి: గ్లామర్‌తో మతిపోగొడుతోన్న బ్యూటీ.. సినిమా బ్యాన్‌ చేయాలంటూ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement