vidisha
-
లోక్‌సభ బరిలో మాజీ సీఎం.. అక్కడి నుంచే పోటీ?
రాబోయే లోక్‌సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు ప్రారంభించాయి. ఎన్డీయేకు 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఒంటరిగా బరిలోకి దిగి 370కు పైగా సీట్లను గెలుస్తుందని ఇటీవల ఆయన ప్రకటించారు. మరోవైపు విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల పంపకాల చర్చలు ఇంకా ఖరారు కాలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల తేదీలు ప్రకటించనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు తమ అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే బీజేపీ కాంగ్రెస్‌లు ఇంకా ఎవరి పేరును ప్రకటించలేదు. కాగా తాజాగా మీడియాకు అందిన సమాచారం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని విదిశ లోక్‌సభ స్థానం టిక్కెట్‌ను బీజేపీ.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విదిశ జిల్లా జనాభా దాదాపు 14.5 లక్షలు. ఇక్కడ 1984 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 1989 నుంచి ఇక్కడ బీజేపీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం బీజేపీకి చెందిన రమాకాంత్ భార్గవ విదిశ ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనకు టిక్కెట్టు ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిపై రమాకాంత్ భార్గవ విజయం సాధించారు. ఈ స్థానంలో మొత్తం 12,50,244 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ అభ్యర్థికి 3,49,938 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి రమాకాంత్ భార్గవకు 8,53,022 ఓట్లు దక్కాయి. మధ్యప్రదేశ్‌లోని ఇతర స్థానాల మాదిరిగానే విదిశలో కూడా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు ఎవరిని బరిలోకి దింపుతాయో అధికారికంగా ఇంకా నిర్ణయం వెల్లడికాలేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ విషయానికొస్తే విదిశ అతని సొంత జిల్లా. ఇక్కడి నుంచే ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆయన విదిశ నుంచి ఐదుసార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈ నేపధ్యంలోనే బీజేపీ ఆయనకు విదిశ టిక్కెట్ ఇవ్వనున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జనతా గ్యారేజ్ నటి!
బాలీవుడ్ భామ విదిషా శ్రీవాస్తవ బాలీవుడ్‌తో పాటు తెలుగువారికి కూడా పరిచయమే. 2007లో విడుదలైన మా ఇద్దరి మధ్య అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో అలా,ప్రేమ్, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలోనూ కనిపించింది. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ మెరిసింది. జనతా గ్యారేజ్ మూవీలో ఓ పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఎక్కువగా బుల్లితెరపైనే ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా ఆమె ఈనెల 11న విదిషా ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. అత్యంత దారుణస్థితిలో నటుడు మృతి!) అందుకే ప్రెగ్నెన్సీ వల్ల జూలై నుంచి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుంటున్నారు విదిషా. అయితే ఈ విషయాన్ని ఆమె ఎక్కడా కూడా షేర్ చేయలేదు. డెలివరీకి కేవలం 10 రోజుల ముందు నుంచి మాత్రమే విరామం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అవును.. 2018లోనే విదిషా బాయ్‌ఫ్రెండ్ సాయిక్ పాల్ని పెళ్లి చేసుకుంది. అయితే ఈ విషయాన్ని నాలుగేళ్ల పాటు రహస్యంగా ఉంచింది. బనారస్‌లో పెళ్లయిన విషయాన్ని ఏడాది క్రితమే అఫీషియల్‌గా ప్రకటించింది. తాజాగా ఈ జంట తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికింది. (ఇది చదవండి: గ్లామర్‌తో మతిపోగొడుతోన్న బ్యూటీ.. సినిమా బ్యాన్ చేయాలంటూ..) View this post on Instagram A post shared by Vidisha Srivastava (@vidishasrivastava) -
తల్లి కాబోతున్న జనతా గ్యారేజ్ నటి.. ఫోటో షూట్ వైరల్!
భాభిజీ ఘర్ పర్ హైన్ సీరియల్ ఫేమ్ విదిషా శ్రీవాస్తవ గర్భం ధరించినట్లు వెల్లడించింది. త్వరలోనే బిడ్డకు జన్మినివ్వబోతున్నట్లు బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను పంచుకుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటి జూలైలో తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. తాజాగా ఈ నటి మెటర్నిటీ షూట్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. (ఇది చదలండి: పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నిర్మాత కుమార్తె.. తండ్రి ఎమోషనల్ పోస్ట్!) టాలీవుడ్లో ఎంట్రీ కాగా విదిషా టాలీవుడ్‌తో పాటు కన్నడ, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించింది. 'మా ఇద్దరి మధ్య' అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత అలా, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ, దేవరాయ చిత్రాల్లో నటించింది. ఓకే ఏడాదిలో తెలుగులో ఆమె నటించిన మూడు చిత్రాలు రిలీజయ్యాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిట్ మూవీ జనతా గ్యారేజ్‌లోనూ విదిషా శ్రీవాస్తవ కీలకపాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో రియా పాత్రలో మెప్పించింది. కాగా.. విదిషా శ్రీవాస్తవ 2018 డిసెంబర్లో సాయక్ పాల్‌ను వివాహం చేసుకున్నారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కాదు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విదిషా డెలివరీ తర్వాత ముంబయికి వెళ్లనున్నట్లు తెలిపింది. అయితే తాము ప్రెగ్నెన్సీని ప్లాన్ చేయలేదని.. కానీ తన భర్త తనకు బాగా సపోర్ట్‌తో ఎలాంటి సమస్య రాలేదని వెల్లడించింది. గతంలో ఆమె ఓ షోలో చేరిన 10 నెలలకే గర్భం దాల్చిన విషయం చెప్పేందుకు ఇబ్బంది పడినట్లు చెప్పింది. ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు సెట్లోని అందరూ ఆమెను అభినందించారని పేర్కొంది. (ఇది చదవండి: 'అత్యంత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నా'.. స్టార్ హీరోయిన్ షాకింగ్ నిర్ణయం!) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గాడిదపై సర్పంచ్ ఊరేగింపు: పండగ చేసుకున్న గ్రామస్తులు
భోపాల్: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండగా మధ్యప్రదేశ్‌లో మాత్రం ఆశించినంతగా కురవడం లేదు. దీంతో వర్షాల కోసం ప్రజలు తీరొక్క తీరున పూజలు చేస్తున్నారు. ఇన్నాళ్లు మనం కప్పల పెళ్లి తదితర కార్యక్రమాలు చూశాం. కానీ ఆ రాష్ట్రంలో వింతగా గాడిదపై సర్పంచ్ కూర్చొని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి ఉత్సాహంతో ఈలలు.. కేకలు వేస్తూ డప్పు చప్పుళ్లకు డ్యాన్స్ చేస్తూ వర్షం కోసం ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ రాష్ట్రంలోని విదిశ జిల్లా రంగై గ్రామంలో అనాదిగా ఓ ఆచారం కొనసాగుతోంది. వర్షాల కోసం గాడిదపై సర్పంచ్ గ్రామమంతా ఊరేగాలనే సంప్రదాయం ఉంది. ప్రస్తుతం ఆ జిల్లాలో వర్షాలు సక్రమంగా కురవడం లేదు. దీంతో గ్రామస్తులు అందరూ కలిసి సర్పంచ్ సుశీల్ వర్మకు గత సంప్రదాయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అనుకున్నదే తడువుగా ఒక గాడిదను తీసుకుని వచ్చి దానికి పూజించారు. అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ గాడిదపై కూర్చోగా గ్రామస్తులంతా కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు. పటేల్ బాబా ఆలయం నుంచి గణేశ్ మందిరం వరకు ఊరేగింపు చేపట్టారు. ఈలలు.. కేకలు వేస్తూ ఉత్సాహంగా ఊరేగింపులో గ్రామస్తులు పాల్గొన్నారు. ఊరేగింపు ముగిసిన అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు కురవాలని గ్రామస్తులంతా ప్రార్థించారు. ఈ కార్యక్రమం అనంతరం సర్పంచ్ సుశీల్ వర్మ స్పందించి ఆ ఆనవాయితీ గురించి వివరించారు. ‘గ్రామీణ ప్రాంతాల్లో మాకు వింత ఆచారం ఉంది. గ్రామ అధిపతి (సర్పంచ్) గాడిదపై స్వారీ చేస్తే వర్షం పడుతుందనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే గాడిదపై స్వారీ చేశా. ఒక ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల సమస్య పరిష్కరించడం నా బాధ్యత. అందుకే గాడిదపై ఊరేగి వరుణదేవుడిని ప్రార్థించా’ అని తెలిపారు. -
దారుణం: అంబులెన్స్ నుంచి ఎగిరిపడిన కరోనా మృతదేహం
భోపాల్: కరోనా రెండో దశ సునామీలో ముంచుకొస్తుంది. నిత్యం మూడు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నయి. అదే విధంగా వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఓవైపు కరోనా తీవ్ర రూపం దాల్చుతుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతుంటే.. మరోవైపు కోవిడ్ బాధితుల మృతదేహాలను పూడ్చి పెట్టేందుకు సరైన స్థలం దొరక్కపోవడం మరింత ఆందోళనకరంగా మారింది. ప్రతి చోట కరోనా మృతదేహాలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. శవాలను మోసుకొచ్చి, శ్మశాన వాటికలు ఖాళీగా లేకపోవడంతో తమ వంతుకోసం అంబులెన్సులు వరసగా నిలుచుంటున్నాయి. తాజాగా కోవిడ్ -19 బాధితుల మృతదేహాలను తరలించడంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటన మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది. విదిషా జిల్లాలో ఓ ఆసుపత్రి నుంచి శ్మశాన వాటికకు తరలిస్తున్న అంబులెన్స్ నుంచి ఓ కరోనా మృతదేహం కిందపడిపోయింది. ఈ సంఘటన శుక్రవారం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అధిక వేగంతో వాహనాన్ని మలుపు తిప్పడంతో మృతదేహాన్ని తీసుకెళ్తున్న అంబులెన్స్ గేట్ ఒకటి విరిగింది. దీంతో మృతదేహం ఎగిరి రోడ్డుపై పడింది. దీన్ని గమనించిన కోవిడ్ -19 రోగుల బంధువులు ఆసుపత్రి బయటకి వచ్చి హాస్పిటల్ తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దీనికి సంబధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోంది. అంతేగాక ఆసుపత్రి యాజమాన్యం తమ కుంటుంబీకుల మృతదేహాలను సకాలంలో అప్పగించడం లేదని కొంతమది ఆరోపించారు. అంతేగాక అసలు మరణ వార్త గురించి కుటుంబ సభ్యులకు, బంధువులకు చెప్పడం లేదని విమర్శస్తున్నారు. ఇక ఇటీవల విధిశా జిల్లాలో కోవిడ్ మరణాలు అధికమయ్యాయి. ప్రతిరోజూ సుమారు 20 నుంచి 25 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో నమోదవుతున్న మరణాలను ప్రభుత్వం అధికారికంగా చెప్పడం లేదనే అనుమానాలూ ఉన్నాయి. చదవండి: కరోనా సోకినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? మాస్క్ పెట్టుకోలేదారా.. ఇన్స్పెక్టర్ చెంప చెళ్లుమనిపించాడు! -
70 ఏళ్ల వృద్దురాలిపై అత్యాచారం, హత్య
భోపాల్: ఎన్ని చట్టాలు చేసిన, నిందితులని ఉరి తీస్తున్న దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆగడంలేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరం విదిశలో 70 ఏళ్ల వృద్దురాలిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. వృద్దురాలి సొంత వ్యవసాయ క్షేత్రంలో గురువారం ఉదయం మృతదేహన్ని కనుగొన్నారు. బుధవారం రాత్రి పొలానికి కాపలాకి వెళ్లిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె శరీరంలోని రహస్యప్రదేశాలలో తీవ్ర గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
ఆపరేషన్లు చేశారు.. మంచాలు లేవన్నారు!
భోపాల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు మంచాలు లేక నేలపైనే నిద్రించి అవస్థలు పడిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. మధ్యప్రదేశ్‌లోని విడిశాలో ఓ ఆరోగ్య కేంద్రం కుటుంబ నియంత్రణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. దీనికి పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు కు.ని. ఆపరేషన్లు నిర్వహించింది. కానీ వారికి సరైన వసతులు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైంది. ఆపరేషన్లు చేయించుకున్నవారిలో కేవలం ముగ్గురికి మాత్రమే బెడ్స్ దొరికాయి. మిగతా 37 మంది కటిక నేలపై పడుకుని ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటనపై జిల్లా ప్రధాన వైద్యాధికారి డా. కేఎస్ అహిర్వార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఆసుపత్రి యాజమాన్యం విఫలమైందంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపిస్తామన్నారు. ఇక నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఆసుపత్రి వైద్యాధికారి డా.నరేశ్ బఘేల్‌ను విధులనుంచి తొలగించారు. కాగా ఇలాంటి ఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే జిల్లాలోని ఓ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం 13 మంది మహిళలను నేలపై పడుకోబెట్టిన విషయం తెలిసిందే. -
రెండు తలలు, మూడు చేతుల శిశువు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని విదిశలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ రెండు తలలు, మూడు చేతులు ఉన్న బాబుకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. విదిశ జిల్లాలోని గంజ్బసోడకు చెందిన 21 ఏళ్ల బబితకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది. ఆమె తన తొలి కాన్పు కోసం ఆస్పత్రిలో చేరారు. అయితే అక్కడ ఆమె రెండు తలలు ఉన్న బాబుకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డలను ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రెండు తలలు ఉన్నప్పటికీ.. ఆ బాబుకు ఒకటే గుండె ఉన్నట్టు విదిశ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ విధంగా పిల్లలు జన్మించడం అరుదైన ఘటన అని వైద్యులు పేర్కొన్నారు. అండాలు విడిపోకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు. కాగా, ఇలాంటి సంఘటనే 2016లో భోపాల్‌లో చోటుచేసుకుంది. రెండు తలలు, నాలుగు చేతులతో ఓ బాలుడు జన్మించాడు. -
‘ఉగ్రవాదులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక దేశం’
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత్‌పై విషం చిమ్మిన పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పింది. అణు యద్ధమంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఓ దౌత్యవేత్తలా కాకుండా యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా పాక్ ప్రధాని మాట్లాడారంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ వక్ర బుద్ధిని ఇమ్రాన్ స్వయంగా అంతర్జాతీయ వేదిక మీద తానే ప్రదర్శించారంటూ ఎద్దేవా చేసింది. పాక్ ఉగ్రవాదులకు పుట్టినిల్లుగా మారింది వాస్తవం కాదా అని భారత్ ప్రశ్నించింది. తమ దేశానికి ఉగ్రసంస్థలతో ఎలాంటి సంబంధం లేదని పాక్ నిరూపించగలదా అంటూ సవాల్ చేసింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాక్ కశ్మీర్ గురించి చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మొదటి కార్యదర్శి విదిషా మైత్రా శనివారం స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ దౌత్యవేత్తలా కాకుండా.. యుద్ధాన్ని రెచ్చగొట్టే వ్యక్తిలా అణుయుద్ధం తప్పదంటూ హెచ్చరించడం సరైంది కాదన్నారు మైత్రా. (చదవండి: కర్ఫ్యూ తొలగిస్తే రక్తపాతమే) అంతేకాక పాక్ ప్రధాని ప్రసంగం విభజనను, విభేదాలను పెంచేలా, ద్వేషాన్ని రెచ్చగొట్టెలా ఉందని పేర్కొన్నారు మైత్రా. ఇమ్రాన్ తన ప్రసంగంలో పేర్కొన్న రక్తపాతం, హింసాకాండ, జాతిఆధిపత్యం, తుపాకీని తీయడం వంటి మాటలు 21వ శతాబ్దపు ఆలోచనలను కాకుండా మధ్యయుగపు నియంతృత్వ భావాలను ప్రతిబింబించేలా ఉన్నాయన్నారు మైత్రా. తమ దేశంలో ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా లేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు వాస్తవమే అని ఐక్యరాజ్యసమితి పరిశీలకుడి చేత ఇమ్రాన్ చెప్పించగలరా అంటూ మైత్రా ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఉగ్రవాదుల జాబితాలోని అల్ ఖైయిదా ఉగ్రవాదికి పెన్షన్ అందించే ఏకైక దేశం పాకిస్తాన్ అన్నారు. దీన్ని ఆ దేశం అంగీకరిస్తుందా లేదా అని మైత్రా ప్రశ్నించారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేయకపోతే.. న్యూయార్క్‌లోని హబీబ్ బ్యాంక్‌ను ఎందుకు మూసివేయాల్సి వచ్చిందో పాకిస్తాన్ వివరించగలదా.. ఎఫ్ఏటీఎఫ్ ఎందుకు పాక్‌ను నోటీసులో పెట్టిందో ప్రపంచ దేశాలకు తెలపగలదా.. ఒసామా బిన్ లాడెన్‌కు పాక్ బహిరంగ రక్షకుడని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించగలరా.. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన జాబితాలోని 135 మంది ఉగ్రవాదులకు, 25 ఉగ్ర సంస్థలకు ఆ దేశం ఆశ్రయం ఇవ్వడం నిజం కాదా.. యూఎన్ విడుదల చేసిన జాబితాలోని అల్ ఖయిదా ఉగ్రవాదికి పాక్ పెన్షన్ ఇవ్వడం వాస్తవం కాదా.. ఈ అంశాలను ఇమ్రాన్ ఖండించగలరా అంటూ విదిషా మైత్రా ప్రశ్నల వర్షం కురిపించారు. అంతేకాక భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి, ఇమ్రాన్ ప్రసంగానికి ఎంతో తేడా ఉందన్నారు. మోదీ తన ప్రసంగంలో శాంతి, అహింస సందేశాన్ని ఇస్తే.. ఇమ్రాన్ యుద్ధానికి సిద్ధం అనే సందేశాన్ని ఇచ్చి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని పేర్కొన్నారు విదిషా మైత్రా. (చదవండి: చైనాలో ముస్లింల బాధలు పట్టవా?) భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని కవ్విస్తూ... రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధమే వస్తే.. దాని విపరిణామాలు సరిహద్దులు దాటి విస్తరిస్తాయని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ సమాజంపై బెదిరింపులకు దిగిన సంగతి తెలిసిందే. -
రాహుల్ అనుమతితోనే చెలరేగుతున్నారు..
జైపూర్ : తన ప్రభుత్వంపై మాట్లాడేందుకు అంశాలు కరువైనందునే కాంగ్రెస్ నేతలు రాహుల్ అనుమతితో తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. మూడు దశాబ్ధాల కిందట మరణించిన తన తండ్రిని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తున్నారని దుయ్యబట్టారు. రాజస్ధాన్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. వంద తరాలుగా తన కుటుంబానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గుజరాత్‌లోని మారుమూల గ్రామంలోని ఓ పేద చిన్నకుటుంబం తమదని మోదీ చెప్పుకొచ్చారు. తన కుటుంబాన్ని బయటకు ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించిన మోదీ మోదీ కూడా తమ కుటుంబం గురించి మాట్లాడుతున్నారని రాహుల్ చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ కుటుంబ సభ్యుల గురించి తానేమీ మాట్లాడటం లేదని, దేశ మాజీ ప్రధానులు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేతల గురించే తాను ప్రస్తావిస్తున్నానన్నారు. కాంగ్రెస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. కాగా ప్రధాని మోదీ తన తండ్రి ఎవరో చెప్పాలంటూ కాంగ్రెస్ నేత విలాస్‌రావు ముత్తెంవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు రాజ్‌బబ్బర్ రూపాయి విలువ మోదీ తల్లి వయసు స్ధాయికి క్షీణిస్తోందని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
దారుణం : ప్లాన్‌చేసి మరీ భార్యను!
విదిశా : నిత్యం తాగొచ్చి హింసించే ఆ నిందితుడు, ఇంట్లో ఎవరూ లేకుండా ప్లాన్‌చేసి మరీ భార్యను హత్యచేశాడు. ఈ దారుణం మధ్యప్రదేశ్‌లోని విదిశాలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. విదిశాలోని రాజ్‌పుత్ కాలనీలో హల్కేరామ్ కుష్వాహ, దుర్గాబాయ్ (35) కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. భార్యతో తరచు గొడవపడే కుష్వాహ శుక్రవారం రోజు తన ఇద్దరు కుమారులను బటయకు వెళ్లాలని సూచించాడు. తండ్రి మాట విన్న ఇద్దరు టీనేజర్లు సాయంత్ర ఇంటికి వచ్చి చూడగా తల్లి ఎలాంటి కదలిక లేకుండా పడిఉండటాన్ని గమనించారు. తండ్రి చేసిన దురాగతాన్ని అర్థం చేసుకున్న 15 ఏళ్ల బాలుడు తల్లి హత్యపై ఫిర్యాదు చేశాడని కోత్వాలి పీఎస్ ఇన్స్పెక్టర్ ఆర్ఎన్ శర్మ తెలిపారు. తాగొచ్చి అమ్మను నాన్న కొట్టేవాడని, గతంలో ఓసారి విషం పెట్టి చంపాలని చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ కుమారులు ఇంట్లో లేకుండా చేసి హత్య చేయాలని కుష్వాహ ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే.. వారిని బయటకు పంపించి నిద్రపోతున్న భార్యను హత్య చేశాడు. భార్య ముక్కు, నోరు, కళ్లల్లో గట్టిగా అతుక్కునే జిగురులాంటి పదార్థాన్ని నిందితుడు పోసి.. ఓ గుడ్డను గట్టిగా చుట్టాడు. తొలుత దుర్గాబాయ్ కళ్లు ముసుకుపోయిన తర్వాత ముక్కు, నోరు భాగాల్లో జిగురుపోసి ఊపిరాడకుండా చిత్రహింసలకు గురిచేసి భార్యను ఆ నిందితుడు హత్య చేశాడని ఇన్స్పెక్టర్ శర్మ వివరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2016 మే నెలలో మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు మద్యం సేవించి ఇదేతీరుగా నిద్రిస్తున్న భార్యను హత్య చేయడం పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. -
‘సంచలన’ అభిమానిని చూసి హీరో షాక్!
లండన్/విదిషా: డాన్సింగ్ వీడియోతో ఇంటర్నెట్లో సంచలనం సృష్టించి, ఏకంగా ప్రభుత్వ బ్రాండ్ అంబాసిడర్ కూడా అయిపోయిన తన వీరాభిమాని, ‘డాన్సింగ్ అంకుల్’ సంజీవ్ శ్రీవాస్తవకు హీరో గోవిందా సందేశం పంపాడు. ఓ స్నేహితుడు పంపిన ఆ డాన్సింగ్ వీడియో చూసి చిన్నపాటి షాక్‌కు గురయ్యానని, ఒకరు మనల్ని అనుకరించడం ఎంతైనా ఆనందించాల్సిన విషయమేనని వెటరన్ హీరో అన్నారు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఆయన ‘ఇండియా టుడే’ వార్తా సంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. మీ భార్య కూడా కాలుకదపడం చాలా బాగుంది: ‘‘ ఏదో డాన్స్ చేస్తున్నట్లు కాకుండా పూర్తిగా లీనమై స్టెప్పులు వేశారు. తెలియకుండానే నన్ను అనుకరించారు. నిజంగా ఎవరైనా మనల్ని అనుకరిస్తుంటే అంతకంటే సంతోషం ఏముంటుంది? ఈ సందర్భంగా సంజీవ్ శ్రీవాస్తవ గారికి నా సందేశమిదే.. ‘మీరు డాన్స చేసిన విధానం, ఎంజాయ్ చేసిన తీరు నిజంగా ఆనందింపజేసేలా ఉన్నాయి. కూడా మీ భార్య సైతం స్టెప్స్ వేయడం చాలా బాగుంది. ఎప్పటికీ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా..’’ అని గోవిందా అన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా నియామకం: ‘డాన్సింగ్ అంకుల్’గా ఇంటర్నెట్లో సంచలనం సృష్టించిన విదిషా వాసి, ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దగ్గర్నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీలంతా పొగడ్తలతో ముంచెత్తిన సంగతి తెలిసిందే. డాన్స్‌లో గోవిందానే తనకు ప్రేరణ అని చెప్పుకున్న సంజీవ్ని.. విదిషా మున్సిపల్ కార్పొరేషన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
మహిళా ఎస్ఐని కూడా వదిలి పెట్టలేదు..!
సాక్షి, విదిశా: మధ్యప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఏ మాత్రం తగ్గడం లేదు. మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే మరణ శిక్ష లాంటి కఠిన చట్టాలను ప్రభుత్వం తీసుకు వచ్చినా అత్యాచారాలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని విదిశా పట్టణంలో.. ఒక మహిళా సబ్ ఇన్స్పెక్టర్ని ముగ్గురు వ్యక్తులు అత్యంత నీచంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. మహిళా సబ్ ఇన్స్పెక్టర్ తలదగ్గర తుపాకి పెట్టి మరీ అత్యంత దారుణంగా, క్రూరంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. మహిళా ఎస్ఐ గురించి అశ్లీలంగా, రాయడానికి, వినడానికి కూడా జుగుప్స కలిగించే భాషను ఉపయోగించినట్లు బాధిత మహిళా ఎస్ఐ చెప్పారు. ఇదిలా ఉండగా.. బాధిత మహిళా ఎస్ఐ ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు నిందితులపై లైంగిక వేధింపులు, ప్రభుత్వ అధికారిపై వేధింపులు, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండడం వంటి నేరాలపై వారిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
బేబీ విదిశ.. ఓ అద్భుతం..
ముంబై: నిజంగా ఈ పాప మిరాకిల్ బేబీనే.. ఎందుకంటే.. పుట్టుకతోనే మేజర్ హార్ట్ ప్రోబ్లమ్.12గంటల నిరంతరాయమైన ఆపరేషన్.. ఆరుసార్లు గుండెపోటు. అయినా వైద్యశాస్త్రాన్నే అబ్బురపరుస్తూ అద్భుతంగా కోలుకుంది. పూర్తి ఆరోగ్యంతో మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ కానుంది. వివరాల్లోకి వెళితే కల్యాణ్‌కు చెందిన విశాక, వినోద్ ల మొదటి సంతానం విదిశ. ఆ పాప 45 రోజుల వయసులో ఉన్నపుడు తల్లి పాలు తాగి వాంతి చేసుకుంది. అకస్మాత్తుగా స్పృహ కోల్పోయింది. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు బిడ్డను వెంటనే బిడ్డను స్థానిక నర్సింగ్ హోమ్‌కు తరలించారు. వారు ముంబైలోని బీజే వాడియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. పాప అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్టు పరీక్షల్లో తేలింది. ట్రాన్స్‌పొజిషన్ ఆఫ్ గ్రేట్ ఆర్టరీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు. డా. బిశ్వా పాండా గుర్తించారు. ఇందుకు 12 గంటల సర్జరీ అవసరమని తేల్చారు. మార్చి 14న ఆపరేషన్ జరిగింది. కానీ ఇంతలోనే మరో కొత్త సమస్య మొదలైంది. గుండె పనితీరు మెరుగైనా.. బలహీనంగా ఉన్న ఆమె ఊపిరితిత్తులు ఇబ్బంది పెట్టాయి. ఇలాంటి కేసుల్లో పుట్టగానే గుండెకు సర్జరీ నిర్వహించాలనీ, అలా చేయకపోవడం వల్ల ఇంతకుముందు వ్యవస్థకే ఊపిరితిత్తులు అలవాటు పడ్డాయని డా. పాండా గుర్తించారు. రక్తంలో ఆక్సిజన్ స్థాయి హఠాత్తుగా పడిపోయేది. కార్బన్ డైఆక్సైడ్ మూడు రెట్లు పెరిగేది. ఫలితంగా విదిశకు ఆరుసార్లు గుండెపోటు వచ్చింది. హైఫ్రీక్వెన్సీ వెంటిలేటర్ సాయంతో ఆమెకు చికిత్స అందించారు. 51 రోజుల పాటు ఆ చిన్నారి ఐసీయూలోనే ఉంది. మొత్తానికి రెండు నెలల తర్వాత ఆ పాప కోలుకుంది. దీంతో ఇపుడు మిరాకిల్ బేబీగా నిలిచింది. అంతేకాదు విదిశ తల్లిదండ్రులు పేదవాళ్లు. కేవలం రూ.25వేల ఫీజు మాత్రమే చెల్లించే స్థితిలో వారున్నారు. అయితే మొత్తం రూ.5 లక్షల బిల్లును ఆసుపత్రిలోని పలు దాతలు చెల్లించడం విశేషం. కాగా బి.జె.వాడియా హాస్పిటల్ సిఇఓ డాక్టర్ మిన్నీ బోదాన్వాలా మాట్లాడుతూ గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు సహాయం చేయడానికి కార్డియాక్ సర్జరీ విభాగానికి మూడు సంవత్సరాలపాటు తాము కృషి చేస్తున్నామని, తమ లక్ష్యం ఇప్పటికి నెరవేరిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
మిరాకిల్ బేబి: ఆరు సార్లు హార్ట్ స్ట్రోక్
ముంబై: నాలుగు నెలల వయసున్న విదిషను ముంబైలోని ఓ ఆసుపత్రిలోని వారంతా 'మిరాకిల్ బేబి'గా పిలుస్తున్నారు. అందుకు కారణం ఓ అరుదైన వ్యాధి నుంచి బేబి మృత్యుంజయురాలిగా బయటపడటమే. విదిషకు 45 రోజుల వయసున్నప్పుడు వాంతి చేసుకుని అన్‌కాన్సియస్‌లోకి వెళ్లి పోయింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు వైశాఖ, వినోద్‌లు విదిషను గట్టిగా ఊపడంతో ఆమె మేల్కొని మళ్లీ అన్‌కాన్సియస్‌లోకి వెళ్లి పోవడంతో కంగారుపడి స్ధానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడి సూచనతో బీజే వాడియా ఆసుపత్రికి పాపను తరలించారు. విదిషకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గుండె సాధరణ స్ధితికి వ్యతిరేకంగా పని చేస్తోందని చెప్పారు. దాదాపు 12 గంటల పాటు శ్రమించి గుండెకు ఆపరేషన్ నిర్వహించారు. ఇక్కడి నుంచి మరింత కఠినమైన పరిస్ధితిని ఎదుర్కొంది విదిష. ఆపరేషన్ పూర్తయిన తర్వాత విదిష ఊపిరితిత్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పెట్టసాగాయి. శరీరంలోని రక్తానికి మూడోంతుల ఆక్సిజన్ అవసరమైతే కేవలం ఒక వంతు మాత్రమే ఆక్సిజన్‌ను అందించడం ప్రారంభించాయి. కార్బన్ డై ఆక్సైడ్ స్ధాయి రక్తంలో మూడోంతులకు పెరగడంతో విదిషకు ఆరు సార్లు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. దాదాపు 51 రోజుల పాటు ఐసీయూలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచారు. ఒకానొక సమయంలో 15 నిమిషాల పాటు విదిష గుండెను కృత్రిమంగా కొట్టుకునేలా చేయాల్సివచ్చిందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం విదిష పూర్తిగా కోలుకుందని మరో రెండు రోజుల్లో బేబిని డిస్చార్జ్ చేస్తామని చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని తెలిపారు. -
'మా బిడ్డను బలవంతంగా లాక్కున్నారు'
జైపూర్: తాము ఏ తప్పూ చేయకపోయినా తామేదో కావాలని చేసినట్లు భావించి అమెరికా అధికారులు తమ బిడ్డను బలవంతంగా లాక్కున్నారని, ప్రభుత్వ గుర్తింపు పొందిన సంరక్షణ కేంద్రానికి అప్పగించారని రాజస్థాన్‌కు చెందిన దంపతులు వాపోయారు. జైపూర్ కు చెందిన దంపతులు ఆశిష్ పరీక్, విదిశా అమెరికాలోని న్యూజెర్సీ లో టాటా కన్సల్టెన్సీలో ఉద్యోగం చేస్తున్నారు. విదిశా గత అక్టోబర్ నెలలోనే ఓ బాబుకు జన్మనిచ్చింది. గత నెలలో ఆ బాలుడు చేతిలోకి తీసుకొని ఆడిస్తుండగా చేయి జారి కిందపడ్డాడు. ఆ క్రమంలో అతడి తల టీవీ స్టాండ్ కు తగిలి అనంతరం నేలకు బలంగా తాకింది. దీంతో ఆ బాలుడిని న్యూజెర్సీలోని ఆస్పత్రికి తరలించారు. దీంతో బాలుడికి ప్రాణగండం తప్పింది. సురక్షితంగా కోలుకున్నాడు. అయితే, అమెరికా శిశు సంరక్షణ శాఖకు చెందిన అధికారులు మాత్రం వారు కావాలనే బాబుకు హానీ కలిగించేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ వారి చేతినుంచి బిడ్డను తీసుకొని ప్రభుత్వ శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు. దీంతో ఇప్పుడు తమ బిడ్డను ఎలాగైనా తమకు ఇప్పించండని, అది కేవలం అనుకోకుండా జరిగిన ప్రమాదం మాత్రమేనని అంటున్నారు. గతంలో నార్వేలో కూడా తమ పిల్లలకు సంబంధించి భారతీయ దంపతులకు ఇలాంటి చిక్కులు ఎదురైన విషయం తెలిసిందే. -
బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో శివరాజ్ సింగ్ హవా
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బరిలో నిలిచిన బుధ్ని, విదిశ నియోజకవర్గాల్లో ఆయన హవా కొనసాగుతుంది. బుధ్నిలో ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహేంద్ర సింగ్ చౌహాన్ కంటే 12,777 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే విదిశలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శశాంక్ భార్గవ కంటే దాదాపు 3 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. గతంలో బుధ్నినియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ గెలుపోందారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అయితే గతంలో విదిశ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు శివరాజ్ సింగ్ చౌహాన్ లోక్ సభకు ఎన్నికైయ్యారు. బీజేపీ గట్టిపట్టున్న విదిశ లోక్ సభ నియోజకవర్గానికి లోక్ సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. -
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధిక్యం
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సమీప ప్రత్యర్థి శశాంక్ భార్గవ కంటే 1168 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విదిశ నియోజకవర్గం నుంచి చౌహాన్ ఎన్నికల బరిలో నిలిచారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. బీజేపీ122 మంది అభ్యర్థులు విజయం పథంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 52 మంది అభ్యర్థులు అధిక్యంలో ఉన్నారు.ఇతర పార్టీలకు చెందిన 12 మంది అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్నారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివపూరి శాసనసభ నుంచి బీజేపీ తరపున బరిలోకి దిగిన సింధియా వంశానికి చెందిన కోడలు యశోధర రాజ్ సింధియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జై వర్థన్ సింగ్ రాఘవ్ గడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా ఆధికంలో కొనసాగుతున్నారు.