న్యూఢిల్లీ: పిన్న వయసులో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నాయకుడు రాఘవ్ చద్ధాకు ప్రముఖ నటి స్వర భాస్కర్ వెరైటీగా విషెష్ చెప్పారు.
‘ఇక నుంచి రాఘవ్ చద్ధా పేరు చివర ‘గారు’ జోడించి పిలవాలేమో. ఎంపీ అయినప్పటికీ దీపావళి పార్టీలలో డ్యాన్స్ చేయకుండా వదలం. చద్ధా జీ అభినందనలు. మరింత ఎత్తుకు ఎదగాల ’ని స్వర భాస్కర్ ట్వీట్ చేశారు. దీనికి రాఘవ్ చద్ధా తనదైన శైలిలో బదులిచ్చారు.
‘నా పేరు చివరిలో ఎటువంటి ప్రత్యయాలు అవసరం లేదు. డ్యాన్స్ ఫ్లోర్‌పైకి నన్ను బలవంతం చేయడం పార్లమెంటరీ ప్రత్యేక హక్కు ఉల్లంఘన/పార్లమెంటరీ ధిక్కారం అవుతుంద’ని ట్వీట్ చేశారు. కాగా, రాఘవ్ చద్ధా, స్వర భాస్కర్ మంచి మిత్రులు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో చద్ధా తరపున ఆమె ప్రచారం కూడా నిర్వహించారు.
మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాఘవ్ చద్ధా, అశోక్ మిట్టల్, ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాలు పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రాజ్యసభకు గురువారం ఎన్నికయ్యారు. (క్లిక్: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్’ విజయం..)
Comments
Please login to add a commentAdd a comment