
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకటనపై ఆప్ నేత రాఘవ్ చద్దా స్పందించారు. రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ అగ్ని పరీక్షను ఎదుర్కునేందుకు సిద్దమయ్యారు.
కేజ్రీవాల్ ఈరోజు అగ్నిపరీక్షను ఎదుర్కునేందుకు సిద్ధమయ్యారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కి ఓటు వేయడం ద్వారా ఆయన నిజాయితీని నిరూపించుకుంటారు. అంతేకాదు, బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన దీవార్ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. ఢిల్లీ ప్రజలు తమ చేతులపై కేజ్రీవాల్ నిర్దోషి అని రాస్తారని అన్నారు.
కాగా, మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం, రెండ్రోజుల తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రజలు తీర్పు చెప్పే వరకు ఆ కుర్చీలో కూర్చోను. ఢిల్లీలో ఎన్నికలకు నెలరోజుల సమయం ఉంది. న్యాయస్థానం నుంచి నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ప్రజాకోర్టు నుంచి న్యాయం జరిగి ప్రజల ఆజ్ఞ మేరకే నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాను’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: సిద్ద రామయ్య వైపు దూసుకొచ్చిన అగంతకుడు
Comments
Please login to add a commentAdd a comment