ఎంపీలుగా ఎన్నికైన ఆప్ అభ్యర్థులు
చండీగఢ్: పంజాబ్ నుంచి ఐదుగురు ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అభ్యర్థులు రాజ్యసభ సభ్యులుగా ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైనట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, రాఘవ్ చద్ధా, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు అశోక్ మిట్టల్, ఐఐటీ–ఢిల్లీ ప్రొఫెసర్ సందీప్ పాఠక్, పారిశ్రామికవేత్త సంజీవ్ అరోరాను తమ అభ్యర్థులుగా ఆమ్ ఆద్మీ పార్టీ నామినేట్ చేసింది. నామినేషన్ల గడువు గురువారం ముగిసింది.
ఆమ్ ఆద్మీ మినహా ఇతర పార్టీలు అభ్యర్థులను నామినేట్ చేయలేదు. దీంతో ఆప్ అభ్యర్థులంతా పోటీ లేకుండా ఎగువ సభకు ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి సురీందర్ పాల్ చెప్పారు. రాఘవ్ చద్ధా(33) ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ వ్యవహారాల సహ–ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం వెనుక ఆయన కృషి ఉంది. సందీప్ పాఠక్ ఐఐటీ–ఢిల్లీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment