న్యూఢిల్లీ: చంఢీఘర్ మేయర్ స్థానాన్ని ఇండియా కూటమి కైవసం చేసుకుంటుందని అమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత రాఘవ్ చద్దా జోష్యం చెప్పారు. ఎప్రిల్/మే నెలల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు చంఢీఘర్ మేయర్ విజయం.. ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుందని తెలిపారు. జనవరి 18వ తేదీ జరిగే చంఢీఘర్ మేయర్ ఎన్నికలపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘‘చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో ఇండియా కూటమి చారిత్రక, నిర్ణయాత్మక గెలుపు సొంతం చేసుకుంటుంది. మొదటి సారిగా ఇడియా కూటమి, బీజేపీ మధ్య పోరు జరగనుంది. మేయర్ ఫలితాలు విడుదలయ్యాక ఇండియా కూటమి-1, బీజేపీ-0గా మారబోతుంది. ఈ గెలుపుతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇండియా కూటమి విజయానికి నాంది పలకనుంది’ అని రాఘవ్ చద్దా పేర్కొన్నారు.
#WATCH | Delhi | AAP MP Raghav Chadha says, "INDIA Alliance will fight the Chandigarh Mayor elections with all its strength and register a historic and decisive victory. Don't consider this an ordinary election. This will be an election where for the first time it will be INDIA… pic.twitter.com/l7d4Ej1kpg
— ANI (@ANI) January 16, 2024
ఇండియా కూటమి చంఢీఘర్ మేయర్ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో పోరాడి గెలుపొందుతుందని తెలిపారు. ఈ ఎన్నికలను సాధారణ ఎన్నికలుగా భావించమని పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు తాము ఈ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment