చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి
చండీగఢ్: సర్వోన్నత న్యాయస్థానం జోక్యంతో చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో భంగపాటుకు గురైన బీజేపీ చివరకు సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో విజయబావుటా ఎగరేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ అభ్యరి్ధకి పడిన 8 ఓట్లను చెల్లనివిగా ప్రకటించి బీజేపీ నేత మేయర్ అయ్యేలా చేసిన రిటరి్నంగ్ అధికారిపై సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన దరిమిలా చండీగఢ్ సీనియర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు సైతం అందరి దృష్టినీ ఆకర్షించాయి.
సోమవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండు విజయాలను నమోదుచేసుకుంది. ఫిబ్రవరి 19వ తేదీన ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో 35 సభ్యులుండే మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీ బలం మరింత పెరిగింది. దీంతో సీనియర్ మేయర్ ఎన్నికల్లో ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి గుర్‌ప్రీత్ గబీపై బీజేపీ అభ్యర్థి కుల్‌జీత్ సంధూ విజయం సాధించారు. డెప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ ఆప్ మద్దతు పలికిన కాంగ్రెస్ అభ్యర్థి నిర్మలా దేవిపై బీజేపీ అభ్యర్ధి రాజీందర్ శర్మ గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment