
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా వర్సిటీ విద్యార్థులపై పోలీసులు వ్యవహరించిన తీరును ప్రముఖ నటి స్వరా భాస్కర్ తీవ్రంగా తప్పుబట్టారు. విద్యార్థులను క్రిమినల్స్‌గా చిత్రీకరిస్తున్నారని, వర్సిటీలో ఆందోళకారులపై పోలీసులు దాడి చేయడం సరైనది కాదని అన్నారు. సోమవారం స్థానిక మీడియాతో మాట్లాడిన ఆమె.. విద్యార్థులపై దాడి చేయడం దురదృష్టకరమన్నారు. దాడి చేసే హక్కు పోలీసులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా అనేక యూనివర్సిటీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయని ఆమె గుర్తుచేశారు. విద్యార్థుల వాదనను ప్రభుత్వం ఎందుకు వినడం లేదని నిలదీశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీ చార్జ్ చేసి, హాస్టల్స్‌ను ధ్వసం చేయడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment