
ఈ ఎన్నికల్లో స్వరాభాస్కర్‌లా కాకుండా మీ వేలును ఓటు వేయడానికి ఉపయోగించండి అంటూ ఇద్దరు వ్యక్తులు ప్లకార్డులతో చేపట్టిన ప్రచారం సోషల్‌మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. తన గురించి చేస్తున్న ప్రచారంపై బాలీవుడ్ నటి స్వరభాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్విటర్ వేదికగా ఆ ఇద్దరిపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ‘వారెవ్వా.. నా ట్రోలర్స్ ఇంత ఎండలో కూడా తెగ కష్టపడుతూ.. నా పాపులారిటీ కోసం చెమటను చిందిస్తున్నారు. గాయ్స్ మీ అంకితభావం ఎంతో సంతోషాన్నిస్తుంది.’ అని సెటైరిక్‌గా ట్వీట్ చేసింది.
Awwwwwww!!!!! My trolls are hard at work again, sweating it out in the heat to popularise my name.. You guys are SO dedicated & sweet!!! 🤗🤗🤗🤗❣️❣️❣️❣️ Don’t mind the slut-shaming guys.. their imagination is a bit limited.. but loving the effort you two 🙌🏾🙌🏾🙌🏾 pic.twitter.com/fRqjGZ3b0q
— Swara Bhasker (@ReallySwara) April 29, 2019
ఇక స్వరా గతేడాది వచ్చిన ‘వీరే ది వెడ్డింగ్’ చిత్రంలో స్వయం సంతృప్తికి సంబంధించిన సన్నివేశంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సీన్‌పై అప్పట్లోనే పెద్ద రచ్చ కాగా.. తాజాగా ఎన్నికలకు ముడిపెడుతూ ప్లకార్డులు ప్రదర్శించడం చర్చనీయాంశమైంది. ఆ చిత్రం డిమాండ్ మేరకు స్వరా ఆ సన్నివేశంలో నటించిందని, ఇప్పుడు ఆ సన్నివేశం ప్రస్తావించడం సబబు కాదని కొందరు ఆమెకు మద్దుతు తెలుపుతుండగా.. ఇది భారత సంస్కృతి విరుద్దమని, అలాంటి సన్నివేశంలో ఎలా నటిస్తుందని మరొకరు విమర్శిస్తున్నారు. ఎవరెన్ని అన్నా హేటర్స్ అంతా నన్ను ప్రేమించేవారేనని స్వరా అభిప్రాయపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment