ముంబై: పాత ఇంట్లో కొత్తగా గృహ ప్రవేశం చేశారు బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్. రెండున్నర సంవత్సరాల తరువాత గత నెలలో స్వరా తను పునర్నిర్మించిన( రినోవేటెడ్) పాత ఇంటిలోకి మారారు. కొత్త ఇంటికి మారిన శుభ సందర్భంగా ఆమె వినాయకునికి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న ఫోటోలను స్వరా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. వీటిలో ఆమె సంప్రదాయబద్దంగా చీర ధరించి దేవతల ముందు కూర్చొని పూజారుల సాయంతో పూజ చేశారు. ‘దేవుళ్లు ఆమోదించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింటా హల్‌చల్ చేస్తున్నాయి.
స్వరా భాస్కర్ గృహ ప్రవేశ ఫోటోలను చూస్తుంటే నటి ముఖంలో భక్తి భావన కొట్టొచ్చినట్ల కనిపిస్తోంది. అయితే వీటిని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఆమె గృహ ప్రవేశ పూజ నిర్వహించడమే. ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టే స్వరా ఇప్పుడు ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ‘మీరు ఎథిస్ట్ అనుకున్నాం కానీ ఇలా పూజలు చేస్తున్నారు వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక మరో ఫోటోలో స్వరా భాస్కర్ పూర్తి సరదా మూడ్‌లో మునిగిపోయారు. స్వరా తలపై మట్టి కుండను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఆమె ముఖమంతా సంతోషం వెదజల్లుతుంది. కాగా స్వరా పోస్టులపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొత్త ప్రారంభానికి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వరా గత నెలలో తన ఇంటికి వస్తున్నట్లు ఓ పోస్టు ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే.
చదవండి: తాలిబన్లపై పోస్ట్.. ‘స్వరాను 6 నెలలు ఆఫ్గనిస్తాన్‌కు పంపండి’
వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment