Gruhapravesam
-
న్యూ బిగినింగ్.. యాంకర్ రవి గృహప్రవేశ వేడుక (ఫోటోలు)
-
ఘనంగా సీరియల్ నటి శ్రీవాణి కొత్త ఇంటి గృహప్రవేశం, ఫొటోలు వైరల్
బుల్లితెరపై ఎన్నో సీరియల్స్‌లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నటి శ్రీవాణి. ఎక్కువగా విలన్ పాత్రల్లో నటించి మెప్పించింది. ఓ వైపు నటిగా బిజీగా ఉంటూనే మరోవైపు నెట్టింట అలరిస్తోంది. రీసెంట్గా ఆమె తన సొంత యూట్యూబ్ చానల్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ చానల్లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆమె ఓ కొత్త ప్లాట్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ మధ్య తన కొత్త ప్లాట్‌లో జరుగుతున్న వర్క్‌కు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేసింది. ఇక తాజాగా ఆమె తన కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు. కొత్త ఇంటి గృహప్రవేశ వేడుకు ఆమె చాలా ఘనంగా నిర్వహించారు. చాలామంది బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బిగ్‌బాస్ బ్యూటీ హిమజ, ప్రముఖ సీరియల్ నటి సుష్మా, నవీన, అంజలితో పాటు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు శ్రీవాణికి శుభాకాంక్షలు తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో శ్రీవాణి గృహప్రవేశం వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sushma Kiron🧿 (@sushmakiron) View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) చదవండి: థియేటర్ల ఇష్యూపై నిర్మాత సి కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు షూటింగ్లో హీరోయిన్‌కి కారు ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి! -
‘ఉచితాల’ నుంచి దేశానికి విముక్తి కావాలి
సాత్నా: దేశంలో సామాజిక–ఆర్థిక మార్పులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ముఖ్యసాధనంగా మారిందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఈ పథకం కింద నిర్మించిన ఇళ్లల్లో శనివారం గృహప్రవేశాలను ఆయన రిమోట్ నొక్కి ప్రారంభించారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో నినాదాలు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. పన్ను సొమ్మంతా ఉచితాల కింద పంచేస్తే ట్యాక్స్‌పేయర్లకు బాధ కలుగుతుందని పేర్కొన్నారు. ఎంతోమంది పన్ను చెల్లింపుదార్లు తనకు లేఖలు రాశారని, ఉచితాలకు అడ్డుకట్ట పడాలని కోరుకుంటున్నారని తెలిపారు. ఉచిత పథకాల నుంచి దేశం విముక్తి పొందాలని సమాజంలోని ఒక పెద్ద వర్గం ఆశిస్తుండడం సంతోషం కలిగిస్తోందన్నారు. పీఎంఏవై కింద దేశంలో గత ఎనిమిదేళ్లలో పేదలకు అన్ని వసతులతో కూడిన 3.5 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చామని వివరించారు. పేదలకు ఇచ్చిన ఇళ్లు వారికి కోటల్లాంటివని, వాటిలోకి పేదరికాన్ని అడుగు పెట్టనివ్వకూడదని ప్రధాని పిలుపునిచ్చారు. -
పోలవరం నిర్వాసితుల గృహ ప్రవేశాలు
రంపచోడవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కాలనీలకు తరలివచ్చారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గంగవరం మండలం నేలదోనెలపాడులో నిర్మించిన కాలనీలను కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మంగళవారం ప్రారంభించారు. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయతీ పరిధిలోని 8 గ్రామాల గిరిజనులకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. చదవండి: మేల్కొని.. కలగంటున్న రామోజీ వారంతా మంగళవారం గృహ ప్రవేశాలు చేశారు. కాగా, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా దేవీపట్నం మండలంలో 48 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. వీటిలో దేవీపట్నం, తొయ్యేరు, వీరవరం, రమణయ్యపేట గ్రామాల గిరిజనులు పునరావాస కాలనీలకు గతంలోనే చేరుకున్నారు. కొండమొదలు పంచాయతీ పరిధిలోని 8 గ్రామాలకు పునరావాసం కల్పించడం ద్వారా దేవీపట్నం మండలంలో ముంపునకు గురవుతున్న అన్ని గ్రామాలను పునరావాస కాలనీలకు తరలించినట్టయింది. గోకవరం మండలం కృష్ణునిపాలెంలో గిరిజనేతర నిర్వాసితులకు పునరావాసం కల్పించారు. -
కొత్త ఏడాది.. రెండో రోజు నుంచే శుభకార్యాలకు సెలవు.. ఎందుకంటే
సాక్షి, నిజామాబాద్: మరో రెండు రోజుల్లో శుభకార్యాలకు సెలవులు రానున్నాయి. వివాహ, గృహప్రవేశ తదితర శుభకార్యాలకు అవసరమైన ముహూర్తాలు శుక్రవారంతో ముగియనున్నాయి. శని, ఆదివారాలు మార్గ బహుళ చతుర్దశి, అమావాస్యలు ఆ తర్వాత జనవరి 2 నుంచి శూన్యమాసం (పుష్యమాసం)ప్రారంభమవుతుంది. తిరిగి వివాహ, గృహ ప్రవేశాలు ఫిబ్రవరి 3నుంచి ఆరంభమవుతాయి. జనవరి నెలలో వివాహాది శుభముహూర్తాలు లేవు. ఫిబ్రవరి 3 నుంచి 20 వరకు తిరిగి మార్చి 19 నుంచి 27 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయని పంచాంగకర్తలు చెబుతున్నారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 18 వరకు గురుమౌడ్యమి ఉంటుందని పంచాంగ కర్త కిషన్‌రావు జోషి తెలిపారు. అలాగే పుష్యమాసం శనిదేవుడికి ప్రీతికరం. దీంతో ఈ మాసంలో నవగ్రహ ఆరాధనలు, పిండివంటల్లో నువ్వులు అధికంగా వాడుతారు. ఫిబ్రవరి 5న వసంత పంచమి.. చదువులతల్లి సరస్వతీమాత జన్మతిథి వసంతపంచమి పర్వదినాన్ని ఫిబ్రవరి 5న జరుపుకోనున్నారు. నాటి నుంచి వివాహ గృహప్రవేశ, శంకుస్థాపనలు తదితర అనేక శుభముహూర్తాలు ఆరంభమవుతాయి. అలాగే జనవరి 15న మకర సంక్రాంతి పర్వదినం జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. చదవండి: Nizamabad: ఒక్కరాత్రే పదకొండు ఇళ్లలో చోరీ -
స్వరా భాస్కర్ గృహ ప్రవేశం.. షాకైన నెటిజన్లు
ముంబై: పాత ఇంట్లో కొత్తగా గృహ ప్రవేశం చేశారు బాలీవుడ్ హీరోయిన్ స్వరా భాస్కర్. రెండున్నర సంవత్సరాల తరువాత గత నెలలో స్వరా తను పునర్నిర్మించిన( రినోవేటెడ్) పాత ఇంటిలోకి మారారు. కొత్త ఇంటికి మారిన శుభ సందర్భంగా ఆమె వినాయకునికి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గృహ ప్రవేశ పూజలో పాల్గొన్న ఫోటోలను స్వరా తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశారు. వీటిలో ఆమె సంప్రదాయబద్దంగా చీర ధరించి దేవతల ముందు కూర్చొని పూజారుల సాయంతో పూజ చేశారు. ‘దేవుళ్లు ఆమోదించారు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. స్వరా భాస్కర్ గృహ ప్రవేశ ఫోటోలను చూస్తుంటే నటి ముఖంలో భక్తి భావన కొట్టొచ్చినట్ల కనిపిస్తోంది. అయితే వీటిని చూసిన నెటిజన్లు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం ఆమె గృహ ప్రవేశ పూజ నిర్వహించడమే. ఎక్కువగా నెటిజనుల మనోభావాలు దెబ్బతినే పోస్టులు పెట్టే స్వరా ఇప్పుడు ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోవడంతో ఆశ్చర్యపోతున్నారు ‘మీరు ఎథిస్ట్ అనుకున్నాం కానీ ఇలా పూజలు చేస్తున్నారు వావ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) ఇక మరో ఫోటోలో స్వరా భాస్కర్ పూర్తి సరదా మూడ్‌లో మునిగిపోయారు. స్వరా తలపై మట్టి కుండను తీసుకెళ్తున్నట్లు కనిపిస్తున్న ఈ ఫోటోలో ఆమె ముఖమంతా సంతోషం వెదజల్లుతుంది. కాగా స్వరా పోస్టులపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. కొత్త ప్రారంభానికి ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా స్వరా గత నెలలో తన ఇంటికి వస్తున్నట్లు ఓ పోస్టు ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. చదవండి: తాలిబన్లపై పోస్ట్.. ‘స్వరాను 6 నెలలు ఆఫ్గనిస్తాన్‌కు పంపండి’ వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్ View this post on Instagram A post shared by Swara Bhasker (@reallyswara) -
స్త్రీ వాదానికి... సినీ గృహప్రవేశం : 70
ఫెమినిజమ్... మాకూ స్వేచ్ఛా స్వాతంత్య్రాలున్నాయని ప్రవచించే స్త్రీ వాదం... తెలుగు సాహిత్యంలో 1990ల్లో బలంగా వినపడి, ఆధునికమని పించిన కాన్సెప్ట్! మరి, మన సినిమాల్లో తొలిసారిగా ఆ వాదం, అలాంటి పాత్ర చాలా బలంగా ఎప్పుడు కనిపించింది? ఇటీవల వచ్చిన ఏ కలర్ సినిమాల్లోనో అనుకుంటున్నారా? కాదు... ఇవాళ్టికి సరిగ్గా 70 ఏళ్ళ క్రితం రిలీజైన ఓ బ్లాక్ అండ్ వైట్ సినిమాలో! ఆశ్చర్యం అనిపించినా ఇది నిజం. సారథీ వారి ‘గృహప్రవేశం’ (1946 అక్టోబర్ 4న రిలీజ్) చూడండి. గూడవల్లి రామబ్రహ్మం ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ లాంటి చిత్రాలతో అభ్యుదయ పంథా చిత్రాలకు చిరునామా అయిన సారథీ సంస్థ... దర్శక - నటుడు ఎల్వీ ప్రసాద్, రచయిత త్రిపురనేని గోపీచంద్, తరువాతి కాలపు ప్రముఖ దర్శక- నిర్మాత కె.ఎస్. ప్రకాశరావు (దర్శకుడు కె. రాఘవేంద్రరావు తండ్రి) లాంటి మహామహుల కలయికతో తెరపైకి వచ్చిన ఆధునిక భావాల దర్పణం - ‘గృహప్రవేశం’. ఆడవాళ్ళకి హక్కులే ఉండరాదనే మహిళాద్వేషి హీరో (ఎల్వీ ప్రసాద్). స్త్రీ స్వేచ్ఛను కోరే ఆధునిక యువతి హీరోయిన్ (భానుమతి). సవతి తల్లి ఆరళ్ళు, బలవంతపు పెళ్ళిపోరు పడలేక హీరోయిన్ ఇల్లు వదిలొస్తుంది. హీరో ఇంట్లో తలదాచుకోవడానికి వస్తుంది. వారిద్దరి మధ్య కావలసినంత చర్చ. నాటకీయ పరిణామాలు. ఆఖరికి బ్రహ్మచర్యాన్ని గొప్పగా భావించి, సమాజాభి వృద్ధికి స్త్రీ, సంసారం అవరోధమన్న హీరోకి కనువిప్పు. వారిద్దరి పెళ్ళితో సంసార ‘గృహప్రవేశం’ - ఇదీ చిత్ర కథ. హీరోయిన్ని పెళ్ళాడాలని తపించే సవతి తల్లి తమ్ముడి కామెడీ విలనిజమ్ కథకు అదనపు హంగు. దర్శకుడిగా ఎల్వీ ప్రసాద్కిది తొలి చిత్రం. ప్రభుత్వోద్యోగి కావడం వల్ల సోదరుడు నళినీకాంతరావు పేరుతో తెరపై చలామణీ అయిన లలిత సంగీత దిగ్గజం రజనీకాంతరావుకు పూర్తిస్థాయి సంగీత దర్శకుడిగా ఇదే తొలి ప్రయత్నం. అసలు ఈ చిత్రానికి గోపీచంద్ దర్శకత్వం వహిస్తే, ఎల్వీ ప్రసాద్ సహాయకుడిగా వ్యవహరించాలని మొదట భావించారు. కానీ, చివరకు పెట్టుబడిదారుల సలహా మేరకు దర్శకత్వ బాధ్యత ఎల్వీకే అప్పగించి, గోపీచంద్ రచనకే పరిమితమయ్యారు. కానీ, ఆయన అభ్యుదయ భావాలకు అనుగుణంగానే సినిమా రూపొందింది. ప్రకాశరావు సగంలోనే నిర్మాణ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. దర్శకుడికీ, రచయితకీ మధ్య అభిప్రాయాల్లో ఎక్కడైనా తేడాలుంటే, ఎల్వీ గురువులు హెచ్.ఎం. రెడ్డి, హెచ్.వి. బాబుల నిర్ణయంతో అంతా సర్దుబాటయ్యేదని అప్పటి జర్నలిస్టు స్వర్గీయ ఎం.ఎస్. శర్మ గతంలో ‘సాక్షి’తో చెప్పారు. బలమైన సాంఘిక సమస్యను సైతం వినోదం మేళవించి చెప్పే ఎల్వీ ప్రసాద్ శైలికి ఈ సినిమా నాంది. తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళి చేసి చూడు’(వరకట్నం), ‘మిస్సమ్మ’ (నిరుద్యోగ సమస్య) - ఇలా పోనుపోనూ ఆ ధోరణి బలపడింది. బాక్సాఫీస్ సూత్ర మైంది. ‘గృహప్రవేశం’లో తెరపై హీరో హీరోయిన్లు ఎల్వీ, భానుమతి. కానీ, అత్యంత కీలకం - ఆధునిక గిరీశం లాంటి రమణరావు పాత్రలో సీయస్సార్ ఆంజనేయులు కామెడీ విలనీ నటన. ‘మై డియర్ తులశమ్మక్కా’ అంటూ చిత్రమైన డైలాగ్ డెలివరీ, ‘జానకి నాదేనోయ్’ లాంటి పాటలు స్వయంగా పాడుతూ చేసిన అభినయం సీయస్సార్ బహుముఖ కౌశలంలో కలికితురాయి. కావాలంటే, అప్పట్లో విశేష ప్రేక్షకాదరణ పొంది, ఇప్పటికీ ఛానల్స్‌లో తరచూ వచ్చే ఈ సినిమా చూడండి. ఆ రోజుల్లోనే అపర ఫెమినిస్టు పాత్రలో భానుమతిని గమనించండి. ఆమె మధురగీతాలు వినండి. అలనాటి అపురూప చిత్రమైన ‘గృహప్రవేశం’ 70 ఏళ్ళ పండుగ ఎల్వీ కుమారుడు - ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్ సారథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. స్త్రీలకివ్వాల్సిన గౌరవం, కుహనా సన్న్యా సుల అక్రమాలు, కబుర్ల రాయుళ్ళ వ్యవహారాలు - ఇలా ‘గృహప్రవేశం’ లోని చాలా ఇప్పటికీ వర్తించేవే. ఇవాళ్టికీ పదే పదే కనిపిస్తున్న బాక్సాఫీస్ సూత్రాలే. కాలాని కన్నా ముందే అభ్యుదయ భావనతో వచ్చిన ఒక అపురూప ప్రయత్నానికి అది ఒక గీటురాయి! - రెంటాల జయదేవ -
ప్రముఖ దర్శకుడి కన్నుమూత
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు బైరిశెట్టి భాస్కర రావు (75) కన్నుమూశారు. ఆయన 17 సినిమాలకు దర్శకత్వం వహించారు. గృహప్రవేశం, ధర్మాత్ముడు, భారతంలో శంఖారావం, చల్ మోహనరంగ, మట్టిబొమ్మలు వంటి పలు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అలాగే దాదాపు 40 చిత్రాలకుపైగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. భాస్కరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భాస్కరరావు భౌతికకాయానికి సోమవారం అంత్యక్రియలు జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.