Swara Bhasker trolled for giving birth 4 months after her wedding with Fahad Ahmad - Sakshi
Sakshi News home page

Swara Bhasker: పెళ్లయిన నాలుగు నెలలకేనా?.. స్వర భాస్కర్‌పై నెటిజన్స్ ట్రోల్స్..!

Jun 2 2023 8:44 AM | Updated on Jun 2 2023 9:13 AM

Swara Bhasker trolled for giving birth 4 months after her wedding - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ స్వరభాస్కర్‌ ఫహద్ అహ్మద్ అనే రాజకీయ నేతను పెళ్లాడిన సంగతి తెలిసిందే. మొదట వీరిద్దరూ రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుని.. ఆ తర్వాత‌  సాంప్రదాయబద్దంగా కూడా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలోని జరిగిన పెళ్లికి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితులు హాజరయ్యారు. అయితే తాజాగా స్వర భాస్కర్‌ను నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు? ఓ లుక్కేద్దాం.

(ఇది చదవండి: మళ్లీ పెళ్లికి సిద్ధమైన బాలీవుడ్‌ నటి.. వెడ్డింగ్‌ కార్డ్‌ వైరల్‌)

బాలీవుడ్ నటి స్వర భాస్కర్ దారుణ ట్రోల్స్‌కు గురయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో సమాజ్‌వాదీ పార్టీ (SP) నాయకుడు ఫహద్ అహ్మద్‌ను వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకున్న నాలుగు నెలలకే నటి బిడ్డకు జన్మనిచ్చిందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేశారు. కొంతమంది నెటిజన్స్ చేసిన కామెంట్స్‌తో స్వర భాస్కర్ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. అయితే వీటిపై స్వర భాస్కర్ ఇంతవరకు స్పందించలేదు. 

ఓ నెటిజన్ ట్వీట్ చేస్తూ..'పెళ్లయిన నాలుగున్నర్ర నెలలకే బిడ్డకు జన్మనిచ్చి తన పనిని ముందుగానే పూర్తి చేశారు.' అంటూ పోస్ట్ చేశారు. మరో నెటిజన్ రాస్తూ.. 'పెళ్లయిన 3-4 నెలలకే స్వర భాస్కర్ తల్లి అయిన మాట నిజమేనా?’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు. అయితే కొందరు నెటిజన్స్ ఆమెకు మద్దతుగా కూడా నిలిచారు. కాగా.. నవంబర్ 2021లో స్వరా ఒక బిడ్డను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించింది.

(ఇది చదవండి: లైవ్ షోలో సింగర్‌కు బుల్లెట్‌ గాయం.. ఆస్పత్రికి తరలింపు!)

స్వరా భాస్కర్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌లు

స్వర భాస్కర్ చివరిసారిగా శిఖా తల్సానియా, మెహర్ విజ్, పూజా చోప్రాలతో 'జహాన్ చార్ యార్' చిత్రంలో కనిపించింది. ఆమె 2009లో డ్రామా 'మధోలాల్ కీప్ వాకింగ్'లో సహాయ పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె 'తను వెడ్స్ మను', 'రాంఝనా', 'ప్రేమ్ రతన్ ధన్ పాయో', 'నిల్ బట్టే సన్నత', 'అనార్కలి ఆఫ్ ఆరా', 'వీరే ది వెడ్డింగ్', 'షీర్ ఖోర్మా' వంటి హిట్ చిత్రాలలో నటించింది. స్వర భాస్కర్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్  మిసెస్ ఫలానీలో తొమ్మిది పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement