న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో ఉబర్ క్యాబ్‌ల సంచారంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. అత్యాచారం ఘటన అనంతరం ఓలా క్యాబ్ సంస్థకు అనుమతి ఇచ్చిన మాదిరిగానే తమ సంస్థకు కూడా ఊరట కల్పించాలంటూ చేసిన విన్నపాన్ని తిరస్కరించింది. అయితే ఇందుకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వానికి ఈ నెల 29వ తేదీలోగా ఓ వినతిపత్రాన్ని దాఖలు చేయాలంటూ జస్టిస్ విభూ భక్రూ నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. ఈ క్యాబ్‌లో ఓ మహిళా ఉద్యోగిని కొద్దిరోజుల క్రితం అత్యాచారానికి గురైన సంగతి విదితమే. ‘ఓలాకు మీకు ఎంతో తేడా ఉంది. చార్జీల మొత్తాన్ని ప్రయాణికుడు క్యాబ్ డ్రైవర్‌కు అందజేస్తాడు. మీ విషయంలో అలా కాదు. మరో విధానంలో ముందుకె ళ్లాల్సి ఉంటుంది’అని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల ఆరో తేదీకి వాయిదా వేశారు.
అనధికార ప్లే స్కూళ్లపై వివరణ ఇవ్వండి
అనధికార, గుర్తింపు లేని ప్లేస్కూళ్లకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు... స్థానిక ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ)తోపాటు స్థానిక నగర పాలక సంస్థలకు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీలోగా వివరణ ఇవ్వాలంటూ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. సోషల్ జ్యూరిస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలుచేసిన ప్రజాప్రయోజనాన్ని పరిశీలించిన జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ పీఎస్ తేజ్ నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా స్పందించింది.
‘ఉబర్’పై నిషేధం ఎత్తివేతకు హైకోర్టు నో
Published Thu, Dec 25 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 6:41 PM
Advertisement
Advertisement