ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది.
ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు..
జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్‌టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment