Taxi cab
-
అంబులెన్సు భరించే స్తోమత లేక..
హల్దా్వనీ: ప్రైవేట్ అంబులెన్సు నిర్వాహకులు అడిగినంత ఇచ్చుకోలేని ఓ పేద మహిళ..తన సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీ పైన కట్టుకుని 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి తీసుకెళ్లాల్సి వచి్చంది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. విషయం తెలిసిన సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఘటనపై దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పితోర్‌గఢ్ జిల్లా బెరినాగ్ గ్రామంలో శివానీ(22) అనే మహిళ సోదరుడు అభిషేక్(20) కలిసి ఉంటోంది. శుక్రవారం అభిషేక్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. రైలు పట్టాల పక్కన అపస్మారక స్థితిలో పడిపోయిన అతడిని శివానీ చికిత్స కోసం హల్దా్వనీలోని సుశీలా తివారీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తీసుకొచి్చంది. అప్పటికే అతడు చనిపోయినట్లు పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు శనివారం అభిషేక్ మృతదేహాన్ని శివానీకి అప్పగించారు. సొంతూరుకు తీసుకెళ్లేందుకు ఆస్పత్రి పక్కనే ఉన్న అంబులెన్సుల నిర్వాహకులను ప్రాధేయపడగా రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చవుతుందని వారు చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో ఆమె తమ గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ను బతిమాలుకుంది. అతడు సరే అనడంతో సోదరుడి మృతదేహాన్ని ట్యాక్సీపైన ఉంచి, తాడుతో కట్టేసింది. అక్కడి నుంచి సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని తమ గ్రామానికి చేరుకుంది. ఈ విషయం సీఎం పుష్కర్ సింగ్ ధామి దృష్టికి రావడంతో ఆయన దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, ఆస్పత్రి ఆవరణ వెలుపల జరిగిన ఘటనతో తమకు తెలియలేదని సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ జోషి చెప్పారు. తెలిసినట్లయితే సాయం చేసి ఉండేవారమన్నారు. -
ఏం ఐడియా గురూ! డ్రైవర్ క్రియేటివిటీకి ఫిదా అవుతున్న ప్యాసింజర్లు..
ఆధునిక కాలంలో ఓలా, ఉబర్ ఎక్కువగా వినియోగంలో ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. కావున ఎక్కడికి వెళ్లాలన్నా నిమిషంలో క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. గమ్యాన్ని చేరుతున్నారు. అయితే ప్రయాణంలో బోర్ ఫీల్ కాకుండా ప్యాసింజర్లు మొబైల్ వినియోగించడం వంటివి చేస్తారు. కానీ ఇటీవల ఒక ఉబర్ డ్రైవర్ టెక్నాలజీ ఉపయోగించి ప్రయాణికులకు బోర్ ఫీల్ కాకుండా చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్స్ (ట్విటర్) వేదికగా విడుదలైన వీడియోలో ఉబర్ డ్రైవర్ ప్రయాణికుల కోసం వెనుక ఉన్న వారికోసం ముందు సీటు వెనుక భాగంలో గేమ్ ఆడుకోవడానికి అనుకూలంగా ఒక స్క్రీన్ అమర్చాడు. దీంతో ఆ ట్యాక్సీ ఎక్కిన ప్యాసింజర్లకు విసుగు రాకుండా ఉంటుంది. ఈ ఐడియా చాలామందిని ఫిదా చేస్తోంది. ఇదీ చదవండి: ఆశ్చర్యపరుస్తున్న రూపాయి చరిత్ర - 1947 నుంచి 2023 వరకు.. జర్నీలో వీడియో గేమ్ ఆడుకుంటూ సమయం తెలియాకుండానే ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని ఇప్పటి వరకు 1.7 మిలియన్ల మంది వీక్షించారు, కొంతమంది నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. మొత్తానికి ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి ఉబర్ డ్రైవర్ కొత్తగా ఆలోచించి అందరిని ఆకట్టుకుంటున్నాడు. -
అనుమతి లేని ప్రయాణం.. ఆగమాగం
సాక్షి, శంషాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న క్యాబ్‌లకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రయాణికులకు భద్రత లేకుండా కొనసాగుతున్న ఈ వ్యాపారాన్ని అడ్డుకోడానికి పోలీసులు తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నా కొందరు క్యాబ్ డ్రైవర్లు ఎలాంటి భయం లేకుండా వారి వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఎయిర్‌పోర్టులోకి బుకింగ్‌ల ఆధారంగానే క్యాబ్‌లకు పర్మిషన్ ఇస్తారు. విమానంలో వచ్చే ప్రయాణికులు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వాహనాలతో పాటు ప్రైవేటు వాహనాలు కూడా సమయానుకూలంగా అరైవల్, డిపార్చుర్ కేంద్రాలకు చేరుకుంటాయి. ఆ సమయంలో బుకింగ్ చేసుకున్న కార్లలో ప్రయాణికులు అక్కడి నుంచి నేరుగా వెళ్లిపోతాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఎయిర్‌పోర్టులో ఎలాంటి అనుమతులు లేకుండా కార్లు తిరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం జరిగిన సంఘటన కూడా ఓలా బుకింగ్ స్థానంలో మరో కారు డ్రైవరు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకొని కిడ్నాప్‌కు యత్నించిన సంఘటన కలకలం రేపింది. బుకింగ్ కూడా లేకుండా ఎయిర్‌పోర్టులోకి క్యాబ్‌లు ఎలా ఎంటర్ అవుతున్నాయని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అనుమతులు లేకుండా ఎయిర్‌పోర్టులో తిరుగుతున్న కార్లకు సంబంధించి సుమారు 300కు పైగా టౌటింగ్ కేసులు నమోదు చేశారు. ప్రతిరోజు రెండు నుంచి మూడు ఈ తరహా కేసులు నమోదవుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. కార్డన్ సెర్చ్‌లో.. శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో గత ఐదు, ఆరు మాసాలుగా ఎయిర్‌పోర్టులో కూడా పలుమార్లు కార్డన్ సెర్చ్‌లో కూడా టౌటింగ్ కేసులే అత్యధికంగా నమోదయ్యాయి. ప్రయాణికులను బలవంతంగా కార్లలో ఎక్కించుకుంటున్న క్యాబ్ డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టౌటింగ్పై పోలీసులు సీరియస్‌గా వ్యవహరిస్తున్నా.. అనుమతి లేకుండా ప్రయాణికులను క్యాబ్‌లలో ఎక్కించుకుంటున్న దందా మాత్రం ఆగడం లేదు. ఎయిర్‌పోర్టులో జరుగుతున్న అక్రమ దందాపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అనుమతి లేకుండా జరుగుతున్న టౌటింగ్ వ్యవహారాన్ని పూర్తిస్థాయిలో అడ్డుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తున్నాం అనుమతి లేకుండా, బుకింగ్ లేకుండా ప్రయాణికులను తీసుకెళ్తున్న క్యాబ్ డ్రైవర్లపై టౌటింగ్ కేసులు నమోదు చేస్తున్నాం. ప్రయాణికులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. బుకింగ్ లేని కార్లలో ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. ఎయిర్‌పోర్టులో టౌటింగ్ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం – నారాయణరెడ్డి, ఆర్జీఐఏ ట్రాఫిక్ సీఐ -
రేపు అర్ధరాత్రి నుంచి క్యాబ్ డ్రైవర్ల సమ్మె
ముషీరాబాద్: క్యాబ్ ట్యాక్సీ ధరల పెంపుతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ క్యాబ్ యజమానులు, డ్రైవర్లు సమ్మెలోకి వెళ్లనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ట్యాక్సీ క్యాబ్‌ల వారు నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ క్యాబ్స్ యజమానులు, డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు టి.సంతోషరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.బాగిరెడ్డిలు ప్రకటించారు. బుధవారం వారు దోమలగూడలోని ఎస్ఎంఎస్లో సమ్మెకు సంబంధించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతమున్న క్యాబ్స్ ట్యాక్సీ ధరలు గిట్టుబాటు కావడం లేదన్నారు. డీజిల్ ధరలు, డ్రైవర్ల జీతభత్యాలు, నిర్వహణ ఖర్చులు, రోడ్డు ట్యాక్స్, ఇన్సూరెన్స్ ప్రీమియం పెరిగినా, ట్రాఫిక్ చలానాలు సైతం భారంగా మారినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. యజమానులకు ఫైనాన్స్ అప్పులు మిగిలి కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. గత నెల 20వ తేదీనే సమ్మె చేయాలని భావించినా సమస్యల పరిష్కారానికి వెండర్స్ హామీ ఇవ్వడంతో వాయిదా వేసుకున్నామన్నారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో ప్రస్తుతం క్యాబ్ యజమానులకు, డ్రైవర్లకు ఇచ్చే మొత్తం తక్కువ చేయడమే కాకుండా బిల్లులు కూడా చెల్లించకుండా వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత్యంతరం లేని పరిస్థితిలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామని చెప్పారు. కంపెనీలు, వెండర్స్ చేసే బెదిరింపులకు క్యాబ్స్ ఓనర్లు, డ్రైవర్లు భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె.యాదగిరి, పి.రవి, శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి కె.నర్సింహరెడ్డి పాల్గొన్నారు.