![Uber India Chief Prabhjeet Singh Ferries Passengers in Delhi NCR - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2022/03/13/Uber%20India%20Chief%20Prabhjeet%20Singh.jpg.webp?itok=EZX_gQD4)
ఇప్పుడిప్పుడే వర్క్ ఫ్రం ఆఫీస్ హడావుడి మొదలవుతుంది. రెండేళ్ల తర్వాత మళ్లీ ఉరుకుల పరుగుల జీవితం తిరిగొచ్చింది. క్యాబ్ దొరుకుతుందా? లేదా? దొరికితే సమయానికి ఆఫీసుకు వెళతామా? అన్న సందేహాలతో గుండెల్లో అలజడి మళ్లీ మొదలయ్యింది. ఈ పరిస్థితుల్లో.. క్యాబ్ ఎక్కిన తర్వాత.. డ్రైవర్ ఓ దిగ్గజ కంపెనీకి సీఈఓ అని తెలిస్తే?వెంటనే మీరు ఏమి ఆలోచిస్తారు. ఈ కథనం చదువుతున్నవారు మొదట అలాంటి సంఘటనలు చోటు చేసుకోవాలి కదా అని ఆలోచిస్తారు. కానీ, ఇటీవల అనుభవమే న్యూఢిల్లీ ప్రజలకు ఎదురైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉబెర్ ఇండియా, దక్షిణాసియా సీఈఓ ప్రభజీత్ సింగ్ సంస్థ చేపట్టిన ఓ పరిశోధనలో భాగంగా ఇటీవలే కొన్ని గంటల పాటు డ్రైవర్ అవతారం ఎత్తారు.
సాధారణ క్యాబ్ డ్రైవర్ లాగానే ఢిల్లీ వీధుల్లో ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వారితో కొంతసేపు ముచ్చటించి గమ్యస్థానాలకు చేర్చారు. ఈ విషయాలను క్యాబ్లో ఎక్కిన ప్రయాణికులు తమ సామాజిక మాధ్యమాల్లో వెల్లిడించారు. అనన్యా ద్వివేదీ(లింక్డిన్ యూజర్) ఈ విషయంపై తన అనుభవాలను పంచుకుంది. "చాలా రోజుల తర్వాత వర్క్ ఫ్రం ఆఫీస్ కోసం బయటకొచ్చి నేను క్యాబ్ బుక్ చేశాను. డ్రైవర్ ఎవరో తెలుసా? ఉబెర్ ఇండియా బాస్.. ప్రభజీత్ సింగ్! ఓ రీసెర్చ్'లో భాగంగాడ్రైవర్గా మారారంటా. తొలుత నాకు ఏదో సదేహంగా అనిపించి ఆయన గురించి గూగుల్ చేశాను. ఫొటోలు చూసిన తర్వాతే నేను నమ్మాను. ఇది నిజమే!. సమస్యలను అర్థం చేసుకునేందుకు.. ఇలా డ్రైవర్ అవతారం ఎత్తడమనేది చాలా గొప్ప విషయం" అని ఆమె రాసుకొచ్చింది.
మరో లింక్డిన్ యూజర్ సౌరభ్ కుమార్ వర్మ కూడా ఉబెర్ ఇండియా సీఈఓపై ప్రశంసలు కురిపించారు. ప్రభజీత్ సింగ్ ఉబెర్ సంస్థ సేవలను మరింత మెరుగుపరించేందుకు పరిశోధనలో భాగంగా డ్రైవర్ అవతారం ఎత్తారు. "ఓ పెద్ద కంపెనీకి సీఈఓ మన క్యాబ్ డ్రైవర్గా మారితే మనకు ఎంతో విలువనిస్తున్నట్టే కదా! మనం మరింత భద్రంగా ఉన్నట్టే కదా. ప్రయాణికులను మరింతగా అర్థంచేసుకునేందుకు ప్రభజీత్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే వారితో మాట్లాడుతున్నారు. వారిని పిక్ చేసుకుని, కావాల్సిన చోట దింపుతున్నారు. కుడోస్" అని అన్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకున్నారు.
(చదవండి: Gold Demand: తగ్గేదే లే.. భారత్‌లో పసిడికి తగ్గని డిమాండ్..!)
Comments
Please login to add a commentAdd a comment