
కోల్‌కతా : క్యాబ్ డ్రైవర్లు రోజుకు ఎంతోమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కాగా డ్రైవింగ్ఫీల్డ్లో ఉన్నవారిలో కొంతమందికి ఇతర టాలెంట్స్ కూడా ఉంటాయి.ఇందుకు ఉదాహరణే .. కోల్‌కతాకు చెందిన ఉబెర్ ట్యాక్సీ డ్రైవర్ ఆర్యన్ సోని. హిందూస్థాన్ క్లాసికల్ మ్యూజిక్ లిరిక్స్ ను అద్భుతంగా పాడాడు. కాగా క్యాబ్ డ్రైవర్ పాడిన వీడియోను క్యాబ్లో ప్రయాణిస్తున్న బృందా దాస్ గుప్తా ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. ' మీకు సంగీతమంటే ఇష్టమా అని క్యాబ్ డ్రైవర్ నన్నుఅడిగాడు. నేను అవును అని చెప్పగానే.. నాకూ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమంటూ ఆర్యన్ హిందూస్తాన్ క్లాసికల్ సాంగ్ ను పాడారంటూ' బృందాదాస్ గుప్తా చెప్పింది. ఇదంతా సోషల్‌మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. క్యాబ్ డ్రైవర్ ఆర్యన్ సోని సింగింగ్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment