సామాన్యులకు కేంద్రం మరో భారీ షాక్‌, ఆటో ఎక్కితే జీఎస్టీ కట్టాల్సిందే..! | 5 percent Gst On Auto Rickshaw Services Through E Commerce Platforms | Sakshi
Sakshi News home page

సామాన్యులకు కేంద్రం మరో భారీ షాక్‌, ఆటో ఎక్కితే జీఎస్టీ కట్టాల్సిందే..!

Published Fri, Nov 26 2021 9:25 PM | Last Updated on Fri, Nov 26 2021 9:32 PM

5 percent Gst On Auto Rickshaw Services Through E Commerce Platforms - Sakshi

సామాన్యులకు కేంద్రం మరో భారీ షాకిచ్చింది. ఇప్పటికే నిత్యవసర వస్తుల ధరలపై జీఎస‍్టీని పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆటోలో ప్రయాణించే వారిపై జీఎస్టీ విధించనున్నాయి. అంటే..ఆటో ఎక్కినా ఇకపై చార్జీకి అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆటో రిక్షా బుకింగ్ పై 5 శాతం జీఎస్టీ వసూలుకు నిర్ణయించింది.

అయితే ఈ జీఎస్టీ సాధారణంగా నడిచే షేర్‌, ఇతర ఆటోలు కాదని కేవలం రైడ్‌ షేరింగ్‌ కంపెనీలైన ఓలా, ఊబర్‌ సంస్థల సేవలందించే ఆటోల్లో ప్రయాణించే వారికి జీఎస్టీ వర్తిస్తుందని తెలిపింది. 

దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఈ నెల 18నే ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ కొత్త జీఎస్టీ నిబంధనలు వచ్చే ఏడాది అంటే 2022 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.

చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్‌ కుమార్‌ నవ్వుతుంటే, బిగ్‌బుల్‌ హాయిగా నిద్రపోతున్నాడే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement