బెంగళూరు/యశవంతపుర: ఆధార్ కార్డు నిఘా లేదా గోప్యతకు సంబంధించిన సాధనం కాదని కేవలం గుర్తింపు కార్డు మాత్రమే అని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ మాజీ చైర్మన్ నందన్ నీలేకని పేర్కొన్నారు. ఆధార్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరించదని స్పష్టం చేశారు.
‘ఆధార్ ఒక సరళమైన వ్యవస్థ. ఎందుకంటే ఒక సంస్థ మీకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేటప్పుడు గోప్యతకు సంబంధించిన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. ఆధార్ మీకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని సేకరించదు. నాకు తెలిసి గోప్యత నిఘా కంటే భిన్నంగా ఉంటుంది’అని సోమవారమిక్కడ జరిగిన నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం ఆధార్ సర్వాంతర్యామిగా మారటం ఆందోళన కలిగించే విషయమేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment