ఇన్పీ ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ | Bring back Nandan Nilekani as Infosys chairman, says advisory firm | Sakshi
Sakshi News home page

ఇన్పీ ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ

Published Sat, Aug 19 2017 9:40 AM | Last Updated on Sun, Sep 17 2017 5:42 PM

ఇన్పీ  ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ

ఇన్పీ ఛైర్మన్‌గా ఆయన్ను వెనక్కి తీసుకురండి: ప్రాక్సీ

ముంబై:  సీఈవోగా  విశాల్‌ సిక్కా రాజీనామాతో  దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌ మరోసారి సంక్షోభంలో పడింది. ఈ పరిణామంపై కార్పొరేట్‌  గవర్నెన్స్‌ నిపుణులు, మార్కెట్‌ పెద్దలు భిన్నాభిప్రాయాలు  వ్యక్తం చేశారు. ముఖ్యంగా  ప్రాక్సీ   ఇన్వెస్టర్‌  సలహా సంస్థ ఓ ఆసక్తికర  ప్రతిపాదన చేసింది. ఇన్ఫీలో అ‍త్యంత  ఉన్నత వ్యవస్థాపకులలో ఒకరైన నందన్ నీలేకన్‌ను  బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ తీసుకోవాలని ప్రదిపాదించింది.  ఈ మేరకు ఆయనను కన్విన్స్‌ చేయాల్సి ఉందని  తన నివేదికలో పేర్కొంది. తద్వారా  భారత ఐటీ పరిశ్రమకు గుండెకాయలా ఉన్న  ఇన్ఫీని  కాపాడుకోవడానికి కోరింది. ఇన్ఫీ విజయమే ఐటీ భవిష్యత్తుకు  సూచికలాంటిదని  తెలిపింది.

ఇన్ఫోసిస్ బోర్డు తన సీఈవోను  కాపాడుకోలేకపోయిందని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ (ఐఐఎఎస్‌) సంస్థ  అభిప్రాయపడింది. కార్పొరేట్ పాలన నిపుణులు,  మార్కెట్ విశ్లేషకులు  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులకు ,  నిర్వహణకు మధ్య ఇటీవల  నెలకొన్నవివాదమే దీనిక కారణమని వ్యాఖ్యానించింది.  ఈ  నేపథ్యంలో నందని నీలేకని  సరైన వ్యక్తిగా  పేర్కొంది. టెక్నాలజీ పురోగతితో వేగంతో ఉన్న ఆయన  దేశంలో డిజిటల్ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపింది. అలాగే  ప్రపంచ  నాయకులు, ఇతర  అధికారులతో కలిసి పనిచేసిన అనుభవ ఉందనీ, ఇన్ఫోసిస్ ప్రారంభంనుంచి సంస్థలో ఉన్న నందన్ నీలేకని  కార్పొరేట్ సంస్కృతిని అర్థం చేసుకోవడంతోపాటు  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో కొంతమందితో  సత్సంబంధాలు కలిగి ఉన్నాయని పేర్కొంది.
ఈ పరిణామాలు సమీప భవిష్యత్తులో ఇన్ఫీకి కొంత ఎదురు దెబ్బేనని ఏంజెల్‌  బ్రోకింగ్‌ అభిప్రాయపడింది. అయితే  వీటన్నింటిని సంస్థ అధిగమిస్తుందనే నమ్ముతున్నామని ఏంజిల్ బ్రోకింగ్  ఐటీ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌  సరభ్‌జిత​ కౌర్‌ నంగ్రా చెప్పారు. బోర్డు వైస్ చైర్మన్‌గా    సిక్కాకు ఉద్వాసన పలికే ప్లాన్‌లో భాగమే ఈ నిర్ణయమని సింఘి అడ్వైజర్స్   వ్యవస్థాపకుడు & ఎండీ  మహేష్ సిన్ఘి  అభిప్రాయపడ్డారు.

కాగా మూడు దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్‌ను స్థాపించిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నీలేకనీ కూడా ఒకరు. మార్చి 2002 - ఏప్రిల్ 2007 మధ్య ఆయన సంస్థకు సీఈవోగా తన సేవలందించారు.  అయితే కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ,  భారీ వేతన ప్యాకేజీలపై రగిలిన వివాదం, తదనంతర పరిణమాలు   చివరకు ఇన్ఫోసిస్‌ మొట్టమొదటి నాన్‌- ఫౌండర్‌ సీఈవో విశాల్‌ సిక్కా రాజీనామాకు దారి తీశాయి. ఆయన ఆకస్మిక రాజీనామాతో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌ఓ) యూబీ ప్రవీణ్‌రావు ఎంపికైన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement