194 మంది అభ్యర్థులు సిద్ధం | Mohammad Kaif, Nandan Nilekani among 194 candidates in Congress's first list for LS polls | Sakshi
Sakshi News home page

194 మంది అభ్యర్థులు సిద్ధం

Published Sun, Mar 9 2014 2:16 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

194 మంది అభ్యర్థులు సిద్ధం - Sakshi

194 మంది అభ్యర్థులు సిద్ధం

లోక్ సభ’కు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల
జాబితాలో సోనియా, రాహుల్, నీలేకని, క్రికెటర్ మహ్మద్ కైఫ్
28 మంది మహిళలకు చోటు
35 శాతం టికెట్లు 50 ఏళ్లలోపు వారికే

 
 సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సమరానికి 194 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను శనివారం రాత్రి ప్రకటించింది. 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు రూపొందించిన ఈ జాబితాలో కొత్తవారికి, యువకులతోపాటు సినీ, ఐటీ, క్రికెట్ రంగాలకు చెందిన ప్రముఖులకూ చోటు దక్కింది. జాబితాలో 28 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలతోపాటు అండమాన్ నికోబార్, దాద్రానగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. 35 శాతం టిక్కెట్లు 50 ఏళ్లలోపు వారికే దక్కాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
 
 జాబితాలోని ప్రముఖులు...
 తొలి జాబితాలోని ప్రముఖుల్లో ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ రాయ్‌బరేలీ నుంచి, పార్టీ ఉపాధ్యాక్షుడు రాఢహుల్‌గాంధీ అమేథీ నుంచి పోటీకి దిగుతున్నారు. అలాగే ప్రస్తుత లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ (ససారాం-బీహార్), హోంమంత్రి  షిండే (షోలాపూర్), రైల్వే మంత్రి ఖర్గే (గుల్బర్గా), కన్నడ సినీ నటి రమ్య (మాండ్య-కర్ణాటక), నందన్ నిలేకని (బెంగుళూరు సౌత్), జ్యోతిరాధిత్య సింధియా (గుణ-మధ్యప్రదేశ్), పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ (చింద్వాడ), సంజయ్‌దత్ సోదరి ప్రియాదత్ (ముంబై నార్త్-సెంట్రల్), కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ (ఫరుఖాబాద్) నుంచి పోటీచేస్తున్నారు. ఒడిశాలోని కటక్ స్థానం నుంచి సినీనటి అపరాజిత మహంతికి చోటు లభించింది. మరో ఒడిస్సా సినీనటుడు విజయ్ మహంతికి భువనేశ్వర్ స్థానం కేటాయించారు. గత వారం పార్టీలో చేరిన మాజీ ప్రధాని వాజ్‌పేయి అన్న కూతురు కరుణా శుక్లాకు ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ నుంచి అభ్యర్థిత్వం లభించింది. ప్రముఖ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌కు ఉత్తరప్రదేశ్‌లోని ఫూల్‌పూర్ నుంచి పోటీకి దిగుతున్నారు. నీలేకని శనివారమే పార్టీలో లాంఛనంగా చేరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement