అభ్యర్థుల ఆస్తుల లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిదే! | The most richest Lok Sabha candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ఆస్తుల లెక్క చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిదే!

Published Thu, Apr 10 2014 3:30 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

నందన్ నీలేకని, నామా, విశ్వేశ్వర్ రెడ్డి , వివేక్ - Sakshi

నందన్ నీలేకని, నామా, విశ్వేశ్వర్ రెడ్డి , వివేక్

16వ లోక్సభకు ఒక పక్క నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. 9 విడతలుగా జరిగే ఈ ఎన్నికలలో తొలి విడత ఈ నెల 7న, రెండ విడత 9న జరిగాయి. ఈ రోజున మూడవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. 12న 4వ విడత-17న 5 - 24న 6 - 30న 7 - మే 7న 8వ విడత - మే 12న 9వ విడత ఎన్నికలు జరుగుతాయి. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘానికి సమర్పించే అఫిడవిట్లో తమ వ్యక్తిగత వివరాలు పూర్తిగా తెలియజేయాలి.  తమ ఆస్తుల వివరాలు కూడా స్పష్టం చేయాలి. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు నామినేషన్‌తో పాటు  ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల లెక్కలు చూస్తే  కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పటివరకు నామినేషన్‌లు వేసిన నేతల్లో  కర్ణాటకలోని దక్షిణ బెంగళూరు లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న నందన్ నీలేకని అత్యంత ధనవంతుడుగా తేలింది.

లోక్సభకు పోటీ చేసేవారిలో  ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం అత్యంత ధనవంతు జాబితాలో నందన్ నీలేకనితోపాటు వరుసగా అనిల్‌ కుమార్‌ శర్మ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నామా నాగేశ్వర రావు, మణికుమార్‌ సుబ్బా, నవీన్‌ జిందాల్‌, వివేక్, హెచ్‌ డీ కుమారస్వామి, వి.బాలకృష్ణన్‌, :  పినాకి మిశ్రా,డీకే సురేష్‌,కుల్‌దీప్‌ బిష్ణోయ్‌, ఏ కృష్ణప్ప ఉన్నారు.

అత్యంత సంపన్నులైన ఈ రాజకీయ నేతలు ఎక్కడ నుంచి, ఏ పార్టీ తరపున పోటీ చేస్తున్నారో ఈ దిగువన ఇస్తున్నాం.

మొదటి స్థానం:
పేరు: నందన్‌ నీలేకని - వయసు: 58 ఏళ్లు - ఆస్తులు: రూ.7,700 కోట్లు
పార్టీ: కాంగ్రెస్‌ -  రాష్ట్రం: కర్ణాటక -  స్థానం: దక్షిణ బెంగళూరు లోక్‌సభ
నీలేకని ఇన్ఫోసిస్‌ సహా వ్యవస్థాపకుడు. వచ్చే ఎన్నికలలో ఆయన  గెలిస్తే దేశంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయనేతగా రికార్డులకెక్కుతారు. ఆయన ఆస్తులలో 80 శాతం ఇన్ఫోసిస్‌లోనే షేర్ల రూపంలో ఉన్నాయి.

రెండో స్థానం:
పేరు: అనిల్‌ కుమార్‌ శర్మ -  ఆస్తులు: రూ.850 కోట్లు
పార్టీ: జనతాదళ్‌ (యునైటెడ్‌) - రాష్ట్రం: బీహార్‌ - స్థానం: జహానాబాద్‌ లోక్‌సభ

మూడవ స్థానం:
పేరు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి  - ఆస్తులు: రూ. 600 కోట్లు
పార్టీ : తెలంగాణ రాష్ట్ర సమితి - రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ - స్థానం :చేవెళ్ల

నాలుగవ స్థానం:
పేరు:  నామా నాగేశ్వర రావు - ఆస్తులు : రూ. 338 కోట్లు
పార్టీ : టిడిపి - రాష్ట్రం :  ఆంధ్రప్రదేశ్ - స్థానం : ఖమ్మం

అయిదవ స్థానం:
పేరు: వ్యాపారవేత్త  నవీన్‌ జిందాల్‌  - ఆస్తులు: రూ.300 కోట్లు
పార్టీ: కాంగ్రెస్‌ - రాష్ట్రం: హర్యానా - స్థానం: కురుక్షేత్ర లోక్‌సభ

ఆరవ స్థానం:
పేరు: వివేక్ -  -  ఆస్తులు: రూ.265 కోట్లు
పార్టీ: కాంగ్రెస్-  రాష్ట్రం: ఆంధ్రప్రదేశ్ - స్థానం: పెద్దపల్లి

ఏడవ స్థానం:
పేరు: మణికుమార్‌ సుబ్బా - ఆస్తులు: రూ.205 కోట్లు
పార్టీ: కాంగ్రెస్‌ రెబల్‌ -  రాష్ట్రం: అసోం - స్థానం: తేజ్‌పూర్‌ లోక్‌సభ
మణికుమార్‌ సుబ్బా  ఇప్పటికే  కాంగ్రెస్ అభ్యర్థిగా మూడు సార్లు గెలిచారు. అయితే ఈసారి కాంగ్రెస్‌ ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. దాంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు.

ఎనిమిదవ స్థానం:
పేరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి  హెచ్‌.డి. కుమారస్వామి - ఆస్తులు: రూ.190 కోట్లు
పార్టీ: జనతాదళ్‌ (సెక్యూలర్‌) - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: చిక్‌బళ్లాపూర్

తొమ్మిదవ స్థానం:
పేరు: ఇన్ఫోసిస్ మాజీ సిఎఫ్ఓ వి.బాలకృష్ణన్‌ - ఆస్తులు: రూ.190 కోట్లు
పార్టీ: ఆమ్‌ ఆద్మీ - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: సెంట్రల్‌ బెంగళూరు

పదవ స్థానం:
పేరు: పినాకి మిశ్రా -  ఆస్తులు: రూ.137 కోట్లు
పార్టీ: బీజూ జనతాదళ్‌ -  రాష్ట్రం: ఒడిశా - స్థానం: పూరి
పినాకి మిశ్రా న్యాయవాద వృత్తి నుంచి రాజకీయ నేతగా ఎదిగారు.

11వ స్థానం:
పేరు: డీకే సురేష్‌ - ఆస్తులు: రూ. 85 కోట్లు
పార్టీ: కాంగ్రెస్‌ - రాష్ట్రం: కర్ణాటక - స్థానం: రూరల్‌ బెంగళూరు

12వ స్థానం:
పేరు:  కుల్‌దీప్‌ బిష్ణోయ్‌ -  ఆస్తులు: రూ.78 కోట్లు
పార్టీ: హర్యానా జన్‌హిత్‌ కాంగ్రెస్‌ -  రాష్ట్రం: హర్యానా - స్థానం: హిస్సార్‌

13వ స్థానం:
పేరు: ఏ.కృష్ణప్ప - వయసు:68 -  ఆస్తులు: రూ.70 కోట్లు
పార్టీ: జనతాదళ్‌ (సెక్యూలర్‌) -  రాష్ట్రం: కర్ణాటక - స్థానం:తుమ్కూరు

ఈ ఆస్తుల వివరాలన్నీ వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో  తెలిపినవే. వీరిలో అయిదుగురు కర్ణాకటకు చెందినవారు కాగా, ముగ్గురు ఆంధ్రప్రదేశ్, ఇద్దరు హర్యానాకు  చెందినవారు. బీహార్, అసోం, ఒడిశాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement