దేశాన్ని కుదిపేస్తున్న అగ్నిపథ్ అంశంపై కార్పొరేట్ దిగ్గజాలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అగ్నివీరుల భవిష్యత్‌పై హామీ ఇవ్వగా.. తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని అగ్నిపథ్ స్కీంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇన్ఫోసిస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇన్ఫోసిస్ పరిశీలిస్తుందా అని షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు నందన్ నిలేకని స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం నమ్ముతున్నాం. యువతకు అగ్నిపథ్ అనేది గొప్ప అవకాశం. అగ్నిపథ్‌లో చేరి కెరియర్‌ను ప్రారంభించడమే కాదు, క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవచ్చు. వీటితో పాటు భవిష్యత్ కోసం కావాల్సిన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవచ్చు' అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఇన్ఫోసిస్ యువతలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహిస్తుంది. సంస్థ నిర్దేశించిన సెలక్షన్ క్రైటీరియా మేరకు ఉద్యోగుల్ని నియమించుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment