సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని వ్యాఖ్యలపై సెబీ ఛైర్మన్ అజయ్ త్యాగి ఆసక్తికరమైన కౌంటర్ ఇచ్చారు. ముంబైలోని సెబీ ప్రధాన కార్యాలయంలో జరిగిన బోర్డు సమావేశం తరువాత సెబీ చైర్మన్ అజయ్ త్యాగి స్పందించారు. ప్రదానంగా ‘దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడు’ అన్ని నీలేకని వ్యాఖ్యాలపై స్పందించాలని అడిగినపుడు ఈ విషయాన్ని దేవుడిని అడగాలి లేదా అతడిని (నిలేకని)అడగాలి ఇందులోతాను చెప్పేదేమీలేదంటూ వ్యాఖ్యానించారు.
నవంబర్ 5 న జరిగిన కంపెనీ వార్షిక విశ్లేషకుల సమావేశంలో నందన్ నిలేకని మాట్లాడుతూ కంపెనీ సొంత దర్యాప్తులో విజిల్ బ్లోయర్స్ ఫిర్యాదును బలపరిచే ఆధారాలు లభించలేదన్నారు. అంతేకాదు దేవుడు కూడా ఇన్ఫోసిస్ నెంబర్లను మార్చలేడని పేర్కొన్నసంగతి తెలిసిందే. కాగా ఇన్ఫోసిస్ స్వల్ప కాలంలో లాభాలు, ఆదాయాలు పెంచుకోడానికి అనైతిక పద్ధతులను అనుసరిస్తోందని, కంపెనీలో ‘నైతికమైన ఉద్యోగులు’గా తమను తాము పిలుచుకునే ఓ గ్రూప్, కంపెనీ సీఈఓ సలీల్ పరేఖ్, సీఎఫ్‌ఓ నిరంజన్ రాయ్‌కు వ్యతిరేకంగా కంపెనీ బోర్డుకు, యుఎస్ సెక్యురిటీస్, ఎక్సేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ-సెక్)కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై యుఎస్ సెక్, సెబీ దర్యాప్తును ప్రారంభించాయి.
Comments
Please login to add a commentAdd a comment