
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి నిలేకని రెడీ!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని వచ్చే లోక్‌సభ ఎన్నికల బరిలో అడుగుపెట్టనున్నారు. తద్వారా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న తొలి ఐటీ దిగ్గజం కానున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలన్న తన ఆసక్తిని నిలేకని కాంగ్రెస్‌కు తెలియజేయగా ఆయన అభ్యర్థిత్వాన్ని ఆ పార్టీ పరిశీలిస్తోంది. నిలేకని పోటీపై ఇప్పటికే ఊహాగానాలు రావడం విదితమే. సొంత రాష్ట్రం కర్ణాటక నుంచి ఆయన్ను కాంగ్రెస్ పోటీకి దింపుతుందని వార్తలొచ్చాయి.
వీటిపై ఆయనగానీ, కాంగ్రెస్‌గానీ స్పందిచేందుకు ఇప్పటిదాకా ముందుకు రాలేదు. అయితే ఆయన పోటీ విషయాన్ని కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ శనివారం నిర్ధారించారు. నిలేకని తనను కలిసి, రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖతను వ్యక్తపరిచారని అన్నారు. ఆయన్ను పోటీచేయించాలా? వద్దా? అనే విషయాన్ని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. నిలేకని ప్రస్తుతం భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ చైర్మన్‌గా వ్యవహరిస్తుండడం తెలిసిందే.