
ముంబై: టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో రగిలిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా సూచనలు కనిపించడంలేదు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణల కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండురోజులుగా స్టాక్‌మార్కెట్‌లో ఇన్ఫీ షేరు ఎన్నడూ లేనంతగా కుదేలైంది. దీంతో మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రంగంలోకి దిగనుంది. తాజా ఆరోపణలపై సంస్థను ఇప్పటికే వివరణ కోరింది. త్వరలోనే ఈ వ్యవహారంపై విచారణను ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది అకౌంటింగ్ ప్రమాణాలకు విరుద్దమని కొందరు బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతర్గత ఆడిటర్ల తో ఆడిట్ కమిటీ సంప్రదింపులు జరుపుతోందని, విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కోని నియమించుకున్నామని స్టాక్ ఎక్స్‌చేంజీలకు నీలేకని తెలియజేశారు. మరోవైపు ఖాతాల గోల్‌మాల్ చేయిస్తున్నారని, పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పష్టం చేశారు. కాగా స్వయంగా పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో మంగళవారం ఏకంగా 17 శాతం ఇన్ఫోసిస్ షేరు కుదేలైంది. కాగా, గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. (చదవండి : ఇన్ఫీలో మరో దుమారం ! )
Comments
Please login to add a commentAdd a comment