parekh
-
ఫైనాన్షియల్ లిటరసీతో మహిళా ప్రపంచాన్ని మార్చేస్తోంది!
ఏమీ తెలియకపోవడం వల్ల కలిగే నష్టం సంక్షోభ సమయంలో, కష్టసమయంలో భయపెడుతుంది. బాధ పెడుతుంది. సమస్యల సుడిగుండంలోకి నెట్టి ముందుకు వెళ్లకుండా సంకెళ్లు వేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనన్య పరేఖ్ ‘ఇన్నర్ గాడెస్’ అనే సంస్థను ప్రారంభించింది. ‘ఇన్నర్ గాడెస్’ ద్వారా ఫైనాన్షియల్ లిటరసీ నుంచి మెంటల్ హెల్త్ వరకు అట్టడుగు వర్గాల మహిళల కోసం దేశవ్యాప్తంగా వర్క్‌షాప్‌లు నిర్వహిస్తోంది. చెన్నైలోని మైలాపూర్‌లో ఉమ్మడి కుటుంబంలో పెరిగిన అనన్య పెద్దల నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంది. ఆరు సంవత్సరాల వయసు నుంచే పుస్తకాలు చదవడం అలవాటైంది. ‘పుస్తకపఠనం అలవాటు చేయడం అనేది నా కుటుంబం నాకు ఇచ్చిన విలువైన బహుమతి’ అంటున్న∙ అనన్య పెద్దల నుంచి విన్న విషయాలు, పుస్తకాల నుంచి తెలుసుకున్న విషయాల ప్రభావంతో సమాజం కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయడం ప్రారంభించింది. సోషల్ ఎంట్రప్రెన్యూర్‌గా వడివడిగా అడుగులు వేయడానికి ఈ ఆలోచనలు అనన్యకు ఉపకరించాయి. అనేక సందర్భాలలో లింగ విక్ష ను ఎదుర్కొన్న అనన్య ‘ఇది ఇంతేలే’ అని సర్దుకుపోకుండా ‘ఎందుకు ఇలా?’ అని ప్రశ్నించేది. కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి చర్చించేది. తమ ఇంటికి దగ్గరగా ఉండే ఒక బీద కుటుంబానికి చెందిన పిల్లల కోసం క్లాసు పుస్తకాలు కొనివ్వడం ద్వారా సామాజిక సేవకు సంబంధించి తొలి అడుగు వేసింది అనన్య. ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేసిన అనన్య ఉన్నత ఉద్యోగాలపై కాకుండా మహిళల హక్కులు, మహిళా సాధికారత, చదువు... మొదలైన అంశాలపై దృష్టి పెట్టింది. చెన్నై కేంద్రంగా ‘ఇన్నర్ గాడెస్’ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ తరపున అట్టడుగు వర్గాల మహిళల కోసం ఫైనాన్షియల్ లిటరసీ, ఫైనాన్షి యల్ యాంగై్జటీ, మెంటల్ హెల్త్, పర్సనల్ ఇన్వెస్టింగ్... మొదలైన అంశాలపై దేశవ్యాప్తంగా డెబ్భైకి పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. సరైన సమయంలో ఆర్థిక విషయాలపై అవగాహన కలిగిస్తే అది భవిష్యత్ కార్యాచరణకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో పదహారు నుంచి ఇరవైనాలుగు సంవత్సరాల మధ్య ఉన్న యువతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఇన్నర్ గాడెస్. ఆర్థిక స్వాతంత్య్రం లేకపోవడం కలిగే ఇబ్బందులు, ఉండడం వల్ల కలిగి మేలు, జీరో స్థాయి నుంచి వచ్చి విజయవంతమైన మహిళా వ్యాపారవేత్తల గురించి ఈ వర్క్‌షాప్‌లలో చెప్పారు. షాపింగ్ నుంచి బ్యాంక్ వ్యవహారాల వరకు ఒక మహిళ తన భర్త మీద ఆధారపడేది. దురదృష్టవశాత్తు అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. ఆమె ఇప్పుడు ఎవరి మీద ఆధారపడాలి? ఇలాంటి మహిళలను దృష్టిలో పెట్టుకొని వ్యవహార దక్షత నుంచి వ్యాపార నిర్వహణ వరకు ఎన్నో విషయాలపై ఈ వర్క్‌షాప్‌లలో అవగాహన కలిగించారు. ‘ఇన్నర్ గాడెస్’ నిర్వహించే వర్క్‌షాప్‌ల వల్ల పర్సనల్ ఫైనాన్స్‌కు సంబంధించిన ఎన్నో విషయాలపై మహిళలకు అవగాహన కలిగింది. సరిౖయెన నిర్ణయాలు తీసుకోవడంలో ఇది వారికి ఉపకరించింది. ఇరవై సంవత్సరాల వయసులో ‘ఇన్నర్ గాడెస్’ను ప్రారంభించిన అనన్య తన ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొంది. ‘అవరోధాలు అప్పుడే కాదు ఏదో ఒక రూపంలో ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే వాటికి ఎప్పుడూ భయపడలేదు. ప్రారంభంలో ఫైనాన్షియల్ లిటరసీ అనే కాన్సెప్ట్‌పై నాకు కూడా పరిమిత మైన అవగాహనే ఉండేది. కాలక్రమంలో ఎన్నో నేర్చుకున్నాను. కెరీర్‌కు ఉపకరించే సబ్జెక్ట్‌లకు తప్ప పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్పై మన విద్యాప్రణాళికలో చోటు లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో వర్క్‌షాప్‌లు నిర్వహించాం. వీటిలో ఎంతోమంది వాలంటీర్లు, స్కూల్ స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ఒక అమ్మాయి మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన చేసుకోవడమే కాదు, తన అమ్మమ్మకు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ విషయంలో సహాయపడింది. ఇలాంటివి విన్న తరువాత మరింత ఉత్సాహం వస్తుంది’ అంటుంది అనన్య పరేఖ్. -
ఐటీ ఫ్రెషర్స్‌కు శుభవార్త.. రెండు నెలల్లో 55 వేల ఉద్యోగాల నియామకం!
ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ ఐటీ ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 55 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటున్నట్లు సీఈఓ సలీల్ పరేఖ్ తెలిపారు. "మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 55,000 కళాశాల గ్రాడ్యుయేట్లను నియమించుకోబోతున్నాము. ఈ ప్రక్రియ 2 నెలల్లో ముగుస్తుంది. మేము వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నాము" అని పరేఖ్ నేడు(ఫిబ్రవరి 16న) నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్ షిప్ ఫోరం 2022(ఎన్టిఎల్ఎఫ్)లో అన్నారు. ఈ ఎన్టిఎల్ఎఫ్ ఫోరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు జరగనుంది. కాలేజీ గ్రాడ్యుయేట్లకు ఆరు నుంచి 12 వారాల మధ్య కాలంలో కంపెనీ సమగ్రమైన శిక్షణా అందిస్తుంది అని అన్నారు. ఈ ఏడాది కంపెనీ నియమించుకొనే 55,000 ఉద్యోగులలో 52000 మంది భారత దేశం నుంచి అయితే, మరొక 3,000 మ౦దిని బయట నుంచి నియమించుకొనున్నట్లు పరేఖ్ తెలిపారు. విద్యార్ధులు క్లౌడ్, డేటా అనాలిసిస్, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటి వంటి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవాలని పరేఖ్ సూచించారు. వ్యాపార పరంగా, పెద్ద క్లౌడ్ & డిజిటల్ సంస్థలు ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేస్తున్నాయి అని అన్నారు. ఫ్రెషర్స్ నియామకం పెరుగుతున్నప్పటికీ కంపెనీలలో అట్రిషన్ రేటు పెరుగుతుంది. డిసెంబర్ 2021తో ముగిసిన త్రైమాసికంలో ఇన్ఫోసిస్ సంస్థలో అట్రిషన్ రేటు 25.5 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. (చదవండి: గూగుల్ పే సూపర్ ఆఫర్.. నిమిషాల్లో లక్ష రూపాయల లోన్!) -
వినైల్ కెమికల్స్.. వండర్ ర్యాలీ
పిడిలైట్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసిన వినైల్ కెమికల్స్ ఇటీవల ర్యాలీ బాట పట్టింది.పరేఖ్ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ ప్రధానంగా కెమికల్స్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తుంటుంది. ప్రధానంగా విదేశీ కంపెనీల నుంచి వినైల్ ఎసిటేట్ మోనోమర్(VAM) సరఫరాకు ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా దిగుమతి చేసుకుని దేశీయంగా పంపిణీ చేస్తుంటుంది. కంపెనీలో పిడిలైట్ ఇండస్ట్రీస్‌కు 50.62 శాతం వాటా ఉంది. ఈ మార్చికల్లా వినైల్ కెమికల్స్‌లో పబ్లిక్ వాటా 40.9 శాతంగా నమోదైంది. జోరు తీరిలా వినైల్ కెమికల్స్ షేరు వరుసగా రెండో రోజు జోరందుకుంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో అమ్మేవాళ్లు కరువై 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఎన్ఎస్ఈలో రూ. 10 ఎగసి రూ. 109 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. మంగళవారం సైతం ఈ షేరు 10 శాతం జంప్‌చేసింది. కాగా.. నేటి ట్రేడింగ్‌లో మధ్యాహ్నం 1కల్లా ఈ కౌంటర్లో 1.42 మిలియన్ షేర్లు చేతులు మారాయి. ఇది వినైల్ కెమికల్స్ ఈక్విటీలో 7.7 శాతం వాటాకు సమానంకావడం విశేషం! ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో కలిపి లక్ష షేర్లు పెండింగ్‌లో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలియజేశాయి. 50 శాతం ప్లస్ గత నెల రోజుల్లో వినైల్ కెమికల్స్ షేరు ఏకంగా 111 శాతం దూసుకెళ్లింది. రూ. 52 స్థాయి నుంచి ప్రస్తుతం రూ. 109కు ర్యాలీ చేసింది. గత వారం రోజుల్లోనే 50 శాతం పురోగమించింది. ఈ షేరు ఇంతక్రితం 2018 మే 2న రూ. 136 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. కాగా.. డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నిరుత్సాహకర పనితీరు నేపథ్యంలో షేరు నీరసించినప్పటికీ ఇటీవల జోరు చూపుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే షేరు ర్యాలీ వెనుక కారణాలు ఇంతవరకూ వెల్లడికాలేదని చెబుతున్నారు. -
ఇన్ఫీలో రగిలిన వివాదంపై సెబీ దృష్టి
ముంబై: టెక్ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో రగిలిన వివాదం ఇప్పట్లో పరిష్కారమయ్యేలా సూచనలు కనిపించడంలేదు. కార్పొరేట్ గవర్నెన్స్‌పై ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్‌పై వచ్చిన ఆరోపణల కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండురోజులుగా స్టాక్మార్కెట్లో ఇన్ఫీ షేరు ఎన్నడూ లేనంతగా కుదేలైంది. దీంతో మార్కెట్ రెగ్యులేటరీ సెబీ రంగంలోకి దిగనుంది. తాజా ఆరోపణలపై సంస్థను ఇప్పటికే వివరణ కోరింది. త్వరలోనే ఈ వ్యవహారంపై విచారణను ప్రారంభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది అకౌంటింగ్ ప్రమాణాలకు విరుద్దమని కొందరు బోర్డు సభ్యులకు ఫిర్యాదు చేశారు. అయితే, అంతర్గత ఆడిటర్ల తో ఆడిట్ కమిటీ సంప్రదింపులు జరుపుతోందని, విచారణ కోసం న్యాయసేవల సంస్థ శార్దూల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ అండ్ కోని నియమించుకున్నామని స్టాక్ ఎక్స్చేంజీలకు నీలేకని తెలియజేశారు. మరోవైపు ఖాతాల గోల్మాల్ చేయిస్తున్నారని, పరేఖ్, సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్‌లపై వచ్చిన ఆరోపణల మీద పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామంటూ ఇన్ఫీ చైర్మన్, సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని స్పష్టం చేశారు. కాగా స్వయంగా పరేఖ్‌పై వచ్చిన ఆరోపణలతో మంగళవారం ఏకంగా 17 శాతం ఇన్ఫోసిస్ షేరు కుదేలైంది. కాగా, గడిచిన ఆరేళ్లలో ఇంత భారీగా ఇన్ఫీ షేరు క్షీణించడం ఇదే తొలిసారి. (చదవండి : ఇన్ఫీలో మరో దుమారం ! ) -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్‌కు భారీ గిఫ్ట్ ఇచ్చింది. వార్షిక పనితీరు ఆధారంగా ఉద్యోగులకు అందించే స్టాక్ ప్రోత్సాహకాల్లో 10 కోట్ల రూపాయల మార్కెట్ విలువున్న పరిమిత స్టాక్ యూనిట్లు(ఆర్ఎస్యూ)ను ఆయనకు కేటాయించింది. మరో కీలక ఎగ్జిక్యూటివ్ సీవోవో యూబీ ప్రవీణ్ రావుకు రూ. 4 కోట్ల విలువైన షేర్లను కేటాయించింది. అలాగే సుమారు రూ.5 కోట్ల విలువైన షేర్లను ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు బోర్డు ఆమోదించిన ప్రతిపాదనలు వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆర్ఎస్యూ కేటాయింపు ఉద్యోగుల పనితీరు ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. స్టాక్ ఓనర్షిప్ 2019 పథకం విస్తరణలో భాగంగా ఈ కేటాయింపులని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారత ఐటీ పరిశ్రమలో అనేక అంశాల్లో ఇన్ఫోసిస్ మార్గదర్శిగా ఉందని, ముఖ్యంగా ఆర్ఎస్యూ కేటాయింపులు కీలక మైలురాయి లాంటిదని ఇన్ఫీ సీఈవో వ్యాఖ్యానించారు. ఉద్యోగులే తమకు పెద్ద ఎసెట్ అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా నిరంతర, స్థిరమైన పనితీరుతో విలువైన సేవలందించిన తమ సీనియర్ ఉద్యోగులను గుర్తించి, గౌరవించడం తమ లక్ష్యమని చెప్పారు. అలాగే కంపెనీ దీర్ఘకాల విజయానికి పాటుపడిన ఉద్యోగులను యజమానులను చేయడం ద్వారా వారి శ్రమకు, నిబద్ధతకు ప్రతిఫలం లభిస్తుందని పరేఖ్ చెప్పారు. -
హెచ్డీఎఫ్సీ ఎర్గో లిస్టింగ్ ఇప్పుడే కాదు: పరేఖ్
హెచ్డీఎఫ్సీ గ్రూప్‌కు చెందిన సాధారణ బీమా సంస్థ, హెచ్డీఎఫ్సీ ఎర్గోను ఇప్పట్లో లిస్ట్ యోచనేదీ లేదని హెచ్డీఎఫ్సీ గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. ఈ కంపెనీ మరింతగా వృద్ధి చెందాకే ఐపీఓకు వస్తామన్నారు. ఈ నెల 25 నుంచి హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఆరంభమవుతుందని ఈ సందర్భంగా చెప్పారాయన. ఈ ఐపీఓ తర్వాత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో హెచ్డీఎఫ్సీ వాటా 56.97 శాతం నుంచి 52.92 శాతానికి, స్టాండర్డ్ లైఫ్ వాటా 37.98 శాతానికి తగ్గుతాయని పరేఖ్ తెలిపారు. ఈ నెల 27న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.1,095–1,100 అని, కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. -
ఇన్ఫోసిస్ కొత్త సీఈవో పరేఖ్‌కి రూ.18.6 కోట్ల ప్యాకేజీ
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కొత్త సీఈవో సలిల్ పరేఖ్ వార్షికంగా రూ.18.6 కోట్ల మేర జీతభత్యాలు అందుకోబోతున్నారు. సంస్థ ప్రతిపాదన ప్రకారం.. ఇందులో స్థిరమైన వార్షిక వేతనం రూ.6.5 కోట్లు కాగా, మిగతాది పనితీరు ఆధారితంగా (వేరియబుల్) ఉండనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నుంచి ఈ ప్యాకేజీ అమలవుతుంది. ఈ లోగా తొలి మూడు నెలలకు గాను రూ.2.37 కోట్ల మేర ‘వేరియబుల్ పే’ని ఇన్ఫీ ఇవ్వనుంది. పరేఖ్ పదవీకాలంలో వివిధ దశల్లో రూ.3.25 కోట్ల మేర షేర్లను కొన్ని షరతులకు లోబడి కంపెనీ కేటాయిస్తుంది. అలాగే, రూ.9.75 కోట్ల మేర ఈక్విటీ గ్రాంట్ (ఒక్క దఫా), రూ.13 కోట్ల మేర వార్షిక పనితీరు ఆధారిత ఈక్విటీ గ్రాంట్స్ లభిస్తాయి. ఇన్ఫోసిస్ ఇందుకు సంబంధించి రూపొందించిన ప్రతిపాదనకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోనుంది. పరేఖ్‌ను అయిదేళ్ల పాటు సీఈవోగా కొనసాగించడం, యూబీ ప్రవీణ్ రావుకు మళ్లీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గాను.. హోల్‌టైమ్ డైరెక్టర్‌గాను తిరిగి బాధ్యతలు అప్పగించడం తదితర అంశాలు ఈ ప్రతిపాదనలో ఉన్నాయి. పోటీ కంపెనీలు విప్రో సీఈవో ఆబిదాలి నీముచ్వాలా వార్షికంగా రూ.13.2 కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ రూ.6.22 కోట్లు అందుకుంటున్నారు.ఇన్ఫీకి ప్రమోటర్లు కాకుండా తొలిసారి సీఈవోగా వ్యవహరించిన బయటి వ్యక్తి విశాల్ సిక్కా కాగా... ఆయన 2016–17లో మొత్తం రూ.45.11 కోట్ల ప్యాకేజీ (బోనస్, స్టాక్స్ మొదలైనవన్నీ కలిపి) అందుకున్నారు. వ్యవస్థాపకులతో విభేదాల నేపథ్యంలో ఆయన తప్పుకున్నారు. -
పరేఖ్ (మాజీ కోల్ సెక్రటరీ)రాయని డైరీ
పరేఖ్ (మాజీ కోల్ సెక్రటరీ)రాయని డైరీ టూత్‌పేస్ట్ అయిపోయింది. హోల్డర్‌లో కొత్త టూత్‌పేస్ట్ కూడా ఉంది. కానీ నాకివాళ ఎందుకో బొగ్గు పొడితో పళ్లు తోముకోవాలని పిస్తోంది! రాత్రి ఎఫెక్ట్ కావచ్చు! పొద్దు పోయేదాకా నా బయోగ్రఫీ రాస్తూ కూర్చున్నాను. బొగ్గు బయోగ్రఫీ! పుస్తకం పూర్తి కావచ్చింది. పబ్లిషర్సే.. ఒక్కరూ ఓపెన్ కావడం లేదు. ఓ పెద్ద పబ్లిషర్ సలహా కూడా ఇచ్చాడు. ‘కాసేపు నేను పబ్లిషర్ని కాదనుకోండి. మీ వెల్విషర్ని అనుకోండి. రెండో పుస్తకం అవసరమా చెప్పండి’ అన్నారు! నా మొదటి పుస్తకం ఎఫెక్ట్ ఇంకా ఆయనలో కనిపిస్తోంది. ‘క్రుసేడర్ ఆర్ కాన్స్పిరేటర్ : కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్’! ‘ఇంక ఆపేయండి గురువుగారూ.. ఆ గొడవలూ అవీ. హాయిగా ప్రశాంతంగా ఉండండి’ అని చెబుతున్నాడు నా వెల్విషర్. కొత్త పుస్తకానికి నాకంతా వెల్విషర్లే దొరుకుతున్నారు. పబ్లిషర్లు దొరకడం లేదు. దొరికిన పబ్లిషర్ కూడా.. పుస్తకం టైటిల్ చెప్పగానే సడెన్‌గా వెల్విషర్ అయిపోతున్నాడు! ‘ది కోల్ కనన్‌డ్రమ్ అండ్ జుడెషల్ యారోగెన్సీ’. న్యాయం బొగ్గయిందని రాస్తే, ఎవరు మాత్రం బుక్కవడానికి వస్తారు? నా బుక్ నేనే వేసుకోవాలి. వేసుకుంటాను. ఈ కోర్టులు, చార్జిషీట్లు అన్నీ.. బుక్ చేసేవాళ్ల కోసం మాత్రమే. బుక్ అయిన వాళ్లకోసం కాదు. అందుకని మన వాదన మనమే వినిపించుకోవాలి. కోర్టు మన వాదన విననప్పుడు ఇంటికొచ్చి బుక్ వేసుకోవాలి. నిందితుడు తను నిర్దోషినని నిజం చెబితే న్యాయమూర్తి నమ్మేసి, కేసు పెట్టిన వాళ్ల చెవుల్ని.. అక్కడికక్కడే పీఠం పైకి రప్పించి.. మెలిపెట్టేయడు. లాయర్ ఏం చెబుతాడో అది వింటాడు. లాయర్ ఎంత గట్టిగా చెబితే అంత గట్టిగా వింటాడు. అంతకంటే గట్టిగా మనం బుక్ వేసుకోవాలి. కోర్టులో అంతా నిజమే చెప్పాలి. బుక్ అయిన వాడు అంతా నిజమే చెప్పాలి. బుక్ చేసినవాడూ అంతా నిజమే చెప్పాలి. బుక్ చేసినవాడు, బుక్ అయినవాడూ ఇద్దరూ అంతా నిజమే చెబుతుంటే.. జడ్జి అంతా నిజమే ఎలా వింటాడు? అందుకే మనం బుక్ వేసుకోవాలి. ‘కొత్త పుస్తకంలో కొత్తగా ఏం రాస్తున్నారు?’ అని అడిగారు నిన్న పిచ్చాపాటిగా ఇంటికొచ్చి కూర్చున్న ఓ పెద్ద వెల్విషర్. ‘బడ్జెట్ సూట్‌కేస్‌లో వస్తుంది. చార్జిషీట్లు ట్రంకుపెట్టెల్లో వస్తాయి. బొగ్గును బోగీల్లో తెచ్చినట్టుగా సీబీఐ.. కోల్‌స్కామ్ పత్రాలు మోసుకొచ్చింది! బరువు చాల్లేదనుకుందో ఏమో నా మీదా ఓ ఆరోపణ పత్రం వేసుకొచ్చింది! ఇదంతా రాస్తున్నాను’ అని చెప్పాను. కాస్త టోన్ డౌన్ చేస్తే పుస్తకం వేస్తానన్నాడు. నవ్వాను. ‘నిజాలను టోన్ డౌన్ చెయ్యడం అంటే పళ్లు సరిగ్గా తోముకోకపోవడమే’ అన్నాను. అర్థం కాలేదన్నాడు. అర్థం కాలేనన్నాను. - మాధవ్ శింగరాజు -
ప్రైవేటీకరణపై బాబు విచారణకు సిద్ధపడాలి
వైఎస్సార్ సీపీ డిమాండ్ ప్రభుత్వరంగ సంస్థలను చంద్రబాబు సొంతవారికి పప్పుబెల్లాల్లా కట్టబెట్టారు ఈ విషయాన్ని ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి పరేఖ్ తన పుస్తకంలో వెల్లడించా్టరు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వరంగ సంస్థలను ఆయనకు సంబంధించిన వారికి పప్పు బెల్లాల్లా కట్టబెట్టిన వ్యవహారాలపై విచారణకు సిద్ధపడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. దేశం మొత్తంమీద వందకు పైగా ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే, చంద్రబాబు పాలనలో ఒక్క మన రాష్ట్రంలోనే 54 సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి పి.సి.పరేఖ్ రాసిన ‘యుద్ధ సైనికుడా.. కుట్రదారా..? (క్రుసేడర్ ఆర్ కాన్స్పిరేటర్?)’ అనే పుస్తకంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యవహారాలను వెల్లడించారని తెలిపారు. వాటిని సొంత వారికి కట్టబెట్టడానికి బాబు ఎలా కుట్రలు చేసిందీ, ఆయన ప్రయత్నాలను అడ్డుకోవడానికి తానెలా విఫలయత్నం చేసిందీ కూడా వివరించారన్నారు. పంచబ్యాంకు షరతులకు పాదాక్రాంతుడైన చంద్రబాబు ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి, అదేదో ఆయన విజయగాథలా చెప్పుకున్న వైనాన్ని గుర్తుచేశారన్నారు. చంద్రబాబు చేపట్టిన ప్రైవేటీకరణ వల్ల 26,000 మంది ఉద్యోగాలు కోల్పోతే, దాన్ని ఘనతగా చెప్పుకొన్నారని, అదే బాబు.. ఆయన తొమ్మిదేళ్ల పరిపాలనను ప్రజారంజకమైనదని ఏ ముఖం పెట్టుకుని చెప్పగలరని దుయ్యబట్టారు. బాబు హయాంలో ప్రైవేటీకరించిన సంస్థల జాబితాను ఆమె విలేకరుల సమావేశంలో చూపిస్తూ కొన్నింటిని చదివి వినిపించారు. నిజాం షుగర్స్, చాగల్లు డిస్టిలరీస్, మెట్పల్లి షుగర్ ఫ్యాక్టరీ, ఏపీ షుగర్స్ లిమిటెడ్, ఆల్విన్ ఫ్యాక్టరీ, నెల్లూరు సహకార స్పిన్నింగ్ మిల్లు, ఏపీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, కరీంనగర్ సహకార స్పిన్నింగ్ మిల్లు... ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయని అన్నారు. చక్కెర తయారీ రంగంలో ఏమాత్రం అనుభవం లేని టీడీపీ నేత నామా నాగేశ్వరరావుకు పాలేరు షుగర్ ఫ్యాక్టరీని, సీఎం రమేష్‌కు నెల్లూరు స్పిన్నింగ్ మిల్లును, విశాఖపట్టణం మూర్తికి మరో సంస్థ.. ఇలా ఇచ్చుకుంటూ పోయారని చెప్పారు. చంద్రబాబు చేసిన ఈ నిర్వాకంపై వివరణ ఇచ్చే దమ్మూ, ధైర్యం ఆయన పార్టీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా దక్కించుకున్న వైనంపై టీడీపీ నేతలు విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు. జగన్‌పై దుమ్మెత్తి పోస్తేనే ఈనాడుకు వార్తా...! వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి గ్రాఫ్ (ప్రతిష్ట) ప్రజల్లో బాగా తగ్గిపోయిందంటూ విశాఖ ఎంపీ సబ్బం హరి ఇచ్చిన ఇంటర్వ్యూను ఈనాడు పత్రిక ప్రముఖంగా ప్రచురించడాన్ని ప్రస్తావిస్తూ.. జగన్ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా దానిని ప్రముఖంగా ప్రచురించడాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో సంక్షేమం బాగా జరిగిందని రాసుకునే చేవ ఈనాడుకు లేదని అన్నారు. చంద్రబాబు గ్రాఫ్ ప్రజల్లో పెరుగుతోందని రాసుకోలేక, జగన్‌పై ఎవరు మాట్లాడినా రాస్తోందన్నారు. చెప్పేవాడికి బుద్ధి లేకపోతే రాసేవాడికి అసలే బుద్ధి లేని విధంగా ఉందని విమర్శించారు. సమైక్యాంధ్ర పార్టీ నాయకుడైన సబ్బం హరి ఆయన పార్టీ గురించి, విభజన గురించి మాట్లాడకుండా జగన్‌పైనే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్, సబ్బం హరిలాంటి వారు ఇతర అంశాలపై మాట్లాడిన మాటలు ఈనాడు ప్రచురించదని, కేవలం జగన్‌ను తిడితేనే ప్రముఖంగా ప్రచురిస్తారని అంటూ ఆమె పలు ఉదాహరణలు చెప్పారు.