హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో లిస్టింగ్‌ ఇప్పుడే కాదు: పరేఖ్‌  | HDFC Ergo listing is not just: Parekh | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో లిస్టింగ్‌ ఇప్పుడే కాదు: పరేఖ్‌ 

Published Thu, Jul 19 2018 1:33 AM | Last Updated on Thu, Jul 19 2018 1:33 AM

HDFC Ergo listing is not just: Parekh - Sakshi

హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌కు చెందిన సాధారణ బీమా సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోను ఇప్పట్లో లిస్ట్‌ యోచనేదీ లేదని హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. ఈ కంపెనీ మరింతగా వృద్ధి చెందాకే ఐపీఓకు వస్తామన్నారు. ఈ నెల 25 నుంచి  హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఆరంభమవుతుందని ఈ సందర్భంగా చెప్పారాయన.

 ఈ ఐపీఓ తర్వాత అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలో హెచ్‌డీఎఫ్‌సీ వాటా 56.97 శాతం నుంచి 52.92 శాతానికి,  స్టాండర్డ్‌ లైఫ్‌ వాటా 37.98 శాతానికి తగ్గుతాయని పరేఖ్‌ తెలిపారు. ఈ నెల 27న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,095–1,100 అని, కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement