హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ | HDFC Ergo raises Rs 350 crore through 10-year NCDs | Sakshi
Sakshi News home page

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ

Published Sat, Jan 21 2017 1:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ

హైదరాబాద్‌: దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ విధానంలో నాన్‌–కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్‌ రేటు 7.6%గా ఉందని తెలిపింది. ఎల్‌ అండ్‌ టీ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కొనుగోలు తర్వాత ఈ నిధుల సమీకరణ చేపట్టామని హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో రితేశ్‌ కుమార్‌ తెలిపారు.

భవిష్యత్‌ వృద్ధి, మూలధన పెంపు, కంపెనీ ఆర్థిక పటిష్టత కోసం ఈ నిధులను సమీకరించామని పేర్కొన్నారు. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ‘హెచ్‌డీఎఫ్‌సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్‌ రె గ్రూప్‌ ప్రధాన ఇన్సూరెన్స్‌ సంస్థ ‘ఎర్గో ఇంటర్నేషనల్‌ ఏజీ’ల జాయింట్‌ వెంచరే హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement