ergo
-
హెచ్డీఎఫ్సీ ఎర్గో లిస్టింగ్ ఇప్పుడే కాదు: పరేఖ్
హెచ్డీఎఫ్సీ గ్రూప్‌కు చెందిన సాధారణ బీమా సంస్థ, హెచ్డీఎఫ్సీ ఎర్గోను ఇప్పట్లో లిస్ట్ యోచనేదీ లేదని హెచ్డీఎఫ్సీ గ్రూప్ చైర్మన్ దీపక్ పరేఖ్ స్పష్టం చేశారు. ఈ కంపెనీ మరింతగా వృద్ధి చెందాకే ఐపీఓకు వస్తామన్నారు. ఈ నెల 25 నుంచి హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎమ్‌సీ) ఐపీఓ ఆరంభమవుతుందని ఈ సందర్భంగా చెప్పారాయన. ఈ ఐపీఓ తర్వాత అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో హెచ్డీఎఫ్సీ వాటా 56.97 శాతం నుంచి 52.92 శాతానికి, స్టాండర్డ్ లైఫ్ వాటా 37.98 శాతానికి తగ్గుతాయని పరేఖ్ తెలిపారు. ఈ నెల 27న ముగిసే ఈ ఐపీఓ ప్రైస్‌బ్యాండ్ రూ.1,095–1,100 అని, కనీసం 13 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. -
హెచ్డీఎఫ్సీ ఎర్గో రూ.350 కోట్ల నిధుల సమీకరణ
హైదరాబాద్: దేశీ మూడో అతిపెద్ద సాధారణ బీమా కంపెనీ హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ తాజాగా రూ.350 కోట్లను సమీకరించింది. ప్రైవేట్ ప్లేస్మెంట్ విధానంలో నాన్–కన్వర్టబుల్ డిబెంచర్స్ (ఎన్సీడీ) జారీ ద్వారా ఈ నిధులను సమీకరించినట్లు సంస్థ పేర్కొంది. వీటి కూపన్ రేటు 7.6%గా ఉందని తెలిపింది. ఎల్ అండ్ టీ జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలు తర్వాత ఈ నిధుల సమీకరణ చేపట్టామని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రితేశ్ కుమార్ తెలిపారు. భవిష్యత్ వృద్ధి, మూలధన పెంపు, కంపెనీ ఆర్థిక పటిష్టత కోసం ఈ నిధులను సమీకరించామని పేర్కొన్నారు. ప్రముఖ దేశీ గృహ రుణాల సంస్థ ‘హెచ్డీఎఫ్సీ’, జర్మనీకి చెందిన మ్యూనిచ్ రె గ్రూప్ ప్రధాన ఇన్సూరెన్స్ సంస్థ ‘ఎర్గో ఇంటర్నేషనల్ ఏజీ’ల జాయింట్ వెంచరే హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్.