ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని బెంగళూరులో ఖరీదైన ప్రాపర్టీని కొనుగోలు చేశారు. నగరంలోని బిలయనీర్స్ స్ట్రీట్‌లో ఉన్న 9,600 చదరపు గజాల స్థలాన్ని ఆయన ఏప్రిల్ 19న కొనుగోలు చేశారు. ఈ ప్రాపర్టీ కోసం ఆయన ఏకంగా రూ.58 కోట్ల రూపాయలు చెల్లించారు. ఇందులో స్టాంప్ డ్యూటీ కింద రూ. 2 కోట్లు పన్ను కట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సింగిల్ ప్రాపర్టీ విషయంలో ఇదే ఖరీదైన డీల్‌గా చెప్పుకుంటున్నారు.
బెంగళూరులోని కోమంగల ఏరియాలోని బ్లాక్ 3ని బిలియనీర్స్ స్ట్రీట్‌గా పిలుస్తారు. ఐటీ బూమ్ వచ్చిన తర్వాత సంపన్నులైన వారిలో ఎక్కువ మంది ఇక్కడే నివసిస్తున్నారు. దీంతో ఈ ఏరియాలో స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉందని రియల్టీ వర్గాలు అంటున్నాయి. ఫ్యామిలీ ట్రస్టు ద్వారా నందనిలేకని కొనుగోలు చేసిన ప్రాపర్టీ 9,600 చదరపు అడుగులు ఉండగా ఇందులో బిల్డప్ ఏరియా 3,084 చదరపు అడుగులు ఉంది.
చదవండి: రూ.110 కోట్ల పెట్టుబడులు..95% ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్‌లలోనే..
Comments
Please login to add a commentAdd a comment