ఎడెల్‌గివ్–హురున్ లిస్టులో అగ్రస్థానం
రెండో స్థానంలో ముకేశ్ అంబానీ
ముంబై: టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ దాతృత్వంలో అంబానీ, అదానీని కూడా మించిపోయారు. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆయన రూ. 2,153 కోట్లు విరాళమిచ్చారు. క్రితం ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఇది 5 శాతం అధికం. దీంతో ఎడెల్‌గివ్–హురున్ వితరణశీలుర లిస్టులో శివ్ నాడార్ అగ్రస్థానంలో నిల్చారు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ. 407 కోట్లతో రెండో స్థానంలో, వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీ రూ. 330 కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు.
జాబితా ప్రకారం మొత్తం మీద 203 మంది రూ. 5 కోట్లకన్నా అధికంగా విరాళమిచ్చారు. హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం రూ. 1,000 కోట్ల పైగా నికర విలువ ఉన్న మొత్తం 1,539 మంది వ్యక్తుల సంపద 46 శాతం పెరిగింది. 203 మంది ఇచి్చన సగటు విరాళం పరిమాణం రూ. 71 కోట్ల నుంచి రూ. 43 కోట్లకు తగ్గింది. వితరణకు సంబంధించి మహిళల జాబితాలో రోహిణి నీలేకని రూ. 154 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా, రూ. 90 కోట్లతో సుస్మితా బాగ్చీ రెండో స్థానంలో ఉన్నారు. రంగాలవారీగా చూస్తే విద్యారంగానికి అత్యధికంగా రూ. 3,680 కోట్లు, హెల్త్‌కేర్‌కి రూ. 626 కోట్లు లభించాయి.
రిచ్ లిస్ట్‌లో రూ. 11.6 లక్షల కోట్ల సంపదతో అదానీ అగ్రస్థానంలో, రూ. 10.14 లక్షల కోట్లతో అంబానీ రెండో స్థానంలో ఉండగా రూ. 3.14 లక్షల కోట్ల సంపదతో శివ్ నాడార్ మూడో స్థానంలో ఉన్నారు. రిచ్ లిస్టులోని ప్రమోటర్ల సారథ్యంలో ఉన్న తొమ్మిది కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద నిర్దేశిత 2 శాతానికి మించి ఖర్చు చేశాయి. వీటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 900 కోట్లు, యార్డీ సాఫ్ట్‌వేర్ ఇండియా రూ. 25 కోట్లు చొప్పున ఖర్చు చేశాయి.
ధనవంతులైన టాప్ 10 పరోపకారుల జాబితా
▸శివ్ నాడార్ & కుటుంబం: రూ. 2,153 కోట్లు
▸ముకేశ్ అంబానీ & కుటుంబం: రూ. 407 కోట్లు
▸బజాజ్ కుటుంబం: రూ. 352 కోట్లు
▸కుమార మంగళం బిర్లా & కుటుంబం: రూ. 334 కోట్లు
▸గౌతమ్ అదానీ & కుటుంబం: రూ. 330 కోట్లు
▸నందన్ నీలేకని: రూ. 307 కోట్లు
▸కృష్ణ చివుకుల: రూ. 228 కోట్లు
▸అనిల్ అగర్వాల్ & కుటుంబం: రూ. 181 కోట్లు
▸సుస్మిత & సుబ్రోతో బాగ్చి: రూ. 179 కోట్లు
▸రోహిణి నీలేకని: రూ. 154 కోట్లు
Who are the top 10 impact leaders in the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List?
Shiv Nadar tops the 2024 EdelGive Foundation HURUN INDIA Philanthropy List, followed by Mukesh Ambani and his family and the Bajaj family. These philanthropic leaders continue to… pic.twitter.com/EsnrO831Hd— HURUN INDIA (@HurunReportInd) November 7, 2024
Comments
Please login to add a commentAdd a comment