సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.
డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్‌లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.
అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.
ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీ
నేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment