జెరోధా ఫౌండర్ 'నిఖిల్ కామత్' ఇటీవల పిల్లలు కనటం, పెంపకం గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. వారసత్వం కోసం పిల్లలను కనటం అనేది సరైనది కాదని తన అభిప్రాయాలను వెల్లడించారు. తన ప్రస్తుత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తానని, పిల్లల పెంపకం కోసం తన జీవితంలో ఎక్కువ రోజులను అంకితం చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వేలకోట్ల సంపాదించినప్పటికీ.. నిఖిల్ కామత్ ఇప్పటికి కూడా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. డబ్బు విషయంలో చాలా స్పష్టంగా ఉండే ఈయన.. పిల్లల విషయంలో మాత్రం కొంత భిన్నంగా ఆలోచిస్తున్నారు. పిల్లలు ఉంటె వారి కోసం మరింత ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది తనకు ఇష్టం లేనట్లు పేర్కొన్నారు. జీవితంలో పిల్లల కోసం ఎక్కువ రోజులు వెచ్చించాల్సిన అవసరం తనకు లేదని ఆయన స్పష్టం చేశారు.
పిల్లలను కంటే.. వారి సంరక్షణ కోసం జీవితంలో 18 నుంచి 20 ఏళ్ళు వెచ్చించాలి. అంటే జీవితంలో 18-20 సంవత్సరాలు వృధా కావచ్చు. ఇది తనకు ఇష్టం లేదని కామత్ అన్నారు. మరణం తరువాత గుర్తుండిపోయేలా.. పిల్లలను కనటంలో ప్రయోజనం ఏమిటి?, నువ్వు రావాలి, బాగా జీవించాలి, నీ జీవితంలో కలిసే వారితో మంచిగా ఉండాలి అని నాకు అనిపిస్తుందని నిఖిల్ కామత్ అన్నారు.
భారతీయుడి సగటు జీవిత కాలం 72 సంవత్సరాలు. నా వయసు ఇప్పుడు 37 సంవత్సరాలు. అంటే నేను ఇంకో 35 సంవత్సరాలు జీవిస్తాను. అయితే ఇప్పటికి సంపాదించినా డబ్బును బ్యాంకుల్లో వృధాగా వదిలేయలేను. కాబట్టి నేను సంపాదించే డబ్బును స్వచ్చంద సంస్థలకు ఇవ్వాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment