ఢాకా : బంగ్లాదేశ్ ఇస్కాన్ పరిణామాల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసులు అరెస్ట్ చేసిన చిన్మయ్ కృష్ణదాస్ వ్యవహారంపై బంగ్లాదేశ్ ఇస్కాన్ స్పందించింది.
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ స్పందించారు. చిన్మయ్‌తో, ఆయన చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు. గతంలోనే చిన్మయ్‌ను మా సంస్థ నుంచి తొలగించాం’ అని అన్నారు.
గతంలో క్రమశిక్షణను ఉల్లంఘించిన కారణంగా ఇస్కాన్‌లోని అన్ని సంస్థాగత కార్యకలాపాల నుండి, పదవుల నుండి చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును తొలగించినట్లు చెప్పారు. న్యాయవాది మరణంపై జరుగుతున్న అసత్య ప్రచారాల్ని ఖండించారు. న్యాయ వాది మరణం, దేశంలో కొనసాగుతున్న నిరసనలతో బంగ్లాదేశ్ ఇస్కాన్‌కు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఇస్కాన్ మతపరమైన, ఘర్షణ కార్యకలాపాలలో పాల్గొనలేదని, ఐక్యత సామరస్యాన్ని పెంపొందించడంలో మాత్రమే పాల్గొంటుందని ఆయన అన్నారు.
#Bangladesh | Chinmoy Krishna Das Brahmachari does not belong to us: #ISKCONBangladesh
The organization would not shoulder any responsibility over his statements and speech: Charu Chandra Das Brahmachari, General Secretary, #ISKCON Bangladesh@DhakaPrasar #ChinmoyKrishnaDas… pic.twitter.com/cuaR5SRc6V— All India Radio News (@airnewsalerts) November 28, 2024
Comments
Please login to add a commentAdd a comment