నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు | sri krishnastami celebrations under iskan | Sakshi
Sakshi News home page

నేడు ఇస్కాన్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు

Published Wed, Aug 28 2013 2:49 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

sri krishnastami celebrations under iskan

 బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : బెంగళూరుకు చెందిన శ్రీ ప్రభుపాద ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గాంధీనగర్‌లోని వాసవి కమిటీ వట్టం సమితి హాల్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ నేత హరికృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.   ప్రతి ఏటా మాదిరిగా ఈ సారి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.
 
 ఉదయం 9 నుంచి 12 వరకు శ్రీకృష్ణుని దర్శనం, 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రాథమిక పాఠశాల విభాగం విద్యార్థులకు శ్రీకృష్ణుడు, గోపికల వస్త్ర ప్రదర్శన, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సాంస్కృతిక పోటీలు, అనంతరం 8.30 గంటల వరకు అభిషేకం, 9 గంటలకు ఊయల సేవ, అనంతరం ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిటీ ఎమ్మెల్యే అనిల్ లాడ్, జేడీఎస్ యువనేత భరత్‌రెడ్డి, వివిధ కార్పొరేటర్లు ఆహ్వానించామన్నారు. ఈ సమావేశంలో జువెలరీ మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సోని, వట్టం జగదీష్, శివప్ప, ప్రభు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement