
సాక్షి, అనంతపురం : ప్రత్యేక హోదా ఆంధ్రా ప్రజల హక్కు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన్ని కలిసిన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ విద్యార్థులకు ఆయన మద్దతు ప్రకటించారు.
ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా విద్యార్థుల జేఏసీ డిసెంబర్ 20న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వారంతా జగన్‌ను కలిసి మద్దతు కోరారు. ఛలో ఢిల్లీకి తమ పార్టీ మద్దతు ఉంటుందని.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా తమ ఎంపీలు గళం వినిపిస్తారాని ఆయన విద్యార్థులకు తెలిపారు.
కాగా, పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ కూడేరు గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించి.. పార్లమెంటు సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment